end

నేడు ముఖ్యమంత్రి కీలక సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భాగంగా వ‌్యవసాయేత‌ర భూముల రిజిస్ట్రేష‌న్లపై స‌మీక్షించి నిర్ణయం తీసుకుంటారు. ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి సీఎస్‌, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ధ‌ర‌ణి’ పోర్టల్ ద్వారా వ్యవ‌య‌సాయేతర భూముల రిజిస్ట్రేష‌న్లు ప్రారంభించాల‌ని తెలంగాణ సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

కాగా, ఇప్పటికే రెండు నెలలుగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌లు ఆగిపోయాయి. ఇవాళ జరగనున్న ఈ సమావేశంలో వీలైనంత త్వర‌గా రిజిస్ట్రేష‌న్లు ప్రారంభించడానికి ఏం చేయాలి..? అనే అంశంపై అధికారులతో కేసీఆర్చ ర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే.. రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ను కలిసిన ఇదివరకే రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగం అధికారుల సంఘాలు కలిశాయి. ‘ధరణి’ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు అంతా సిద్ధంగా ఉందనీ.. మెరుగైన సేవలకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని అధికారులు, సిబ్బంది ఇదివరకే వెల్లడించారు.

Exit mobile version