end

ఇవాళే అప్లికేషన్‌ చివరి రోజు

ఐబీపీఎస్‌ పీవో ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. 3,517 పీవో పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడగా.. అక్టోబర్‌ 28న అప్లికేషన్‌ ప్రక్రియ ప్రారంభమయింది. నవంబర్‌ 11 చివరి తేదీ. అప్లికేషన్‌ చేయని నిరుద్యోగులు గమనించాలి. చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని బ్యాంక్ ఉద్యోగులు సూచిస్తున్నారు. డిగ్రీ పాసై, 20 నుంచి 30 ఏళ్ల వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వచ్చే ఏడాది జనవరి 5,6 తేదీల్లో పీవో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.ibps.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి. జనరల్‌ కేటగిరి, బీసీ అభ్యర్థులకు రూ. 850 ఫీజు కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 175 దరఖాస్తు ఫీజు.

Exit mobile version