end

ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు

  • టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

తెలంగాణలో పోలీసు శాఖ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు కొమ్ము కాస్తుందని, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలపై ప్రతిపక్షాలు గొంతెత్తితే పోలీసులు చీటికిమాటికి కేసులు పెడుతున్నారని వాపోయారు. డీసీసీ అధ్యక్షులు జిల్లాలో అంశాల వారిగా పోరాటాలు చేయాలని సూచించారు.

హాయ్‌ బావా… నేనంటే ఇష్టం లేదా!

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని, ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జిల్లాలో డీసీసీ అధ్యక్షులు చాలా కష్టపడి పని చేస్తున్నారని, ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా ప్రజల పక్షాన నిలిచి ప్రజల సమస్యలను లెవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు.

కరోనాతో 173 మంది పోలీసులు మృతి

గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ పటిష్టంగానే ఉందని, గత ఎన్నికలలో ఓడిపోవడానికి కారణాలు వేరే ఉన్నాయని వివరించారు. కేసీఆర్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని తెలిపారు.

నిండు గర్భవతిని చంపిన భర్త

Exit mobile version