end
=
Friday, November 22, 2024
ఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీTracking App:స్వచ్ఛమైన గాలికోసం ‘ట్రాకింగ్ యాప్స్’
- Advertisment -

Tracking App:స్వచ్ఛమైన గాలికోసం ‘ట్రాకింగ్ యాప్స్’

- Advertisment -
- Advertisment -

  • ఎయిర్ క్వాలిటీ తెలుసుకునేందుకు ‘AQI’యాప్
  • ఆండ్రాయిడ్, ఐవోస్ రెండింటిలో అవైలబుల్
  • Windyలో ఇంట్రెస్టింగ్ ఎయిర్ క్వాలిటీ ఫిల్టర్స్
  • BreezoMeter నుంచి పర్సనల్ హెల్త్ రికమెండేషన్స్

ప్రపంచవ్యాప్తంగా (world wide)ప్రతి తొమ్మిది మందిలో ఒకరి మరణానికి కారణం గాలి కాలుష్యం (Air pollution). తద్వారా ఒక్క 2019లోనే 6.7 మిలియన్ (million)మరణాలు (deaths) సంభవించాయి. యూఎస్ (US)ఆధారిత హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ (Health effect institute)నివేదిక ప్రకారం.. శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల వెలువడే విషపూరితమైన గాలి కారణంగా కలిగిన మరణాల్లో భారతదేశం (india)కూడా అత్యధిక రేటు కలిగి ఉంది. ఇల్లు (home), ఆఫీస్ (office) వంటి ప్రదేశాల్లో ఇండోర్ ఎయిర్ క్వాలిటీని (Indore Air quality)  మనం నియంత్రించగలిగినప్పటికీ, పరిసర ప్రాంతాల్లో అలాచేయడం సాధ్యం కాదు. కాబట్టి బయటకు వెళ్లే ముందు కొన్ని ఆన్‌లైన్ డివైజెస్ (Online Devices), యాప్స్‌ (apps)తో గాలి నాణ్యతను ట్రాక్ (Track)చేయడమొక్కటే మార్గం. ఇందుకోసం కొన్ని ప్రత్యేక AQI యాప్స్ కూడా ఉన్నాయి. ప్రముఖంగా అందులోని మూడు ఆప్షన్స్ (options)గురించి ఇక్కడ తెలుసుకుందాం..

(Sleep: నిద్రకు ముందు చేయకూడని పనులు.. )

స్థానిక కాలుష్యం, ఆరోగ్య పరిగణనల ఆధారంగా గాలి నాణ్యత సూచిక(AQI) విషయంలో వివిధ దేశాలు వేర్వేరు ప్రమాణాలను ఉపయోగిస్తాయి. భారత్‌లో జాతీయ (National) పరిసర వాయు నాణ్యత ప్రమాణాలు ఆరు విభాగాలను కలిగి ఉన్నాయి. మంచి (0-50 పరిధి), సంతృప్తికరంగా(50-100), మధ్యస్థ కాలుష్యం(100-200), నాసిరకం (200-300), అత్యంత నాసిరకం(300-400), తీవ్రమైన(400-500). ఈ వర్గీకరణ అనేది PM2.5, PM10, కార్బన్ మోనాక్సైడ్ (Carbon monoxide)లేదా CO, O3 లేదా ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్, (Ozone, nitrous oxide,) లేదా NO2 వంటి కాలుష్య కారకాల పరిసర సాంద్రత విలువలు, వాటి ఆరోగ్య ప్రభావాలపై ఆధారపడి ఉంటుంది. కాగా కొన్ని యాప్స్ ‘ప్రమాదకరం, అనారోగ్యకరం, చాలా అనారోగ్యకరం’ వంటి సొంత కేటగిరీలను (category)కలిగి ఉంటాయి.

యాపిల్(Apple), గూగుల్ (Google)వంటి కంపెనీలు (company)కూడా కొన్ని ఆఫరల్లో AQI డేటాను (data)మరింత ప్రముఖంగా చేర్చడం ప్రారంభించాయి. iOS 16లో, వెదర్ యాప్ (weather app)మీ ప్రాంతంలోని ప్రస్తుత గాలి నాణ్యత పరిస్థితులను, అది మీ ఆరోగ్యాన్ని (health)ఎలా ప్రభావితం చేస్తుందో చూపిస్తుంది. గూగుల్ మ్యాప్స్‌లో (google maps)మీరు మ్యాప్ టైప్ బటన్‌ (map type button)ను యూజ్ (use)చేయొచ్చు (ఇది ఆండ్రాయిడ్ యాప్‌ (Android app)లో ఎగువభాగాన కుడి వైపున ఉంటుంది). మ్యాప్ వివరాల్లో ‘ఎయిర్ క్వాలిటీ’ని ఆప్షన్‌గా (option)ఎంచుకోవచ్చు. ఇది లొకేషన్-స్పెసిఫిక్ (Location-specific) AQI డేటాను చూపుతుంది. ‘Air Quality Near me’ అనే సింపుల్ గూగుల్ సెర్చ్‌తో (Google search) కూడా ఈ సమాచారాన్ని పొందవచ్చు.

IQAir నుంచి AirVisual :

ఈ కేటగిరీలోని అత్యుత్తమమైన యాప్స్‌లో ఒకటి. ఇది గాలి నాణ్యత సహా గాలి వేగం, ఉష్ణోగ్రత, వర్షం (Rain)కురిసే అవకాశాల గురించి కూడా తెలియజేసే సింపుల్ డిజైన్‌ (Simple device)ను కలిగి ఉంది. రోజువారీ నోటిఫికేషన్స్ (Notifications), వ్యక్తిగత హెచ్చరికలను స్వీకరించడానికి యూజర్లు (users) సెట్టింగ్స్‌ను (settings)టాగుల్ (tagul)చేయొచ్చు. PM2.5, PM10, ఓజోన్, NO2, కార్బన్ (co2)డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ (SO2) సహా చాలా కీలకమైన కాలుష్య కారకాలను ఈ యాప్ ట్రాక్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్‌తో పాటు ఐవోఎస్ (IOS) రెండింటిలో అందుబాటులో ఉంది.

Windy :

వాస్తవానికి ఇదొక బ్యూటిఫుల్ వెదర్ (Beautiful weather)యాప్. కొన్ని ఇంట్రెస్టింగ్ ఎయిర్ క్వాలిటీ ఫిల్టర్స్‌ (Quality filters)ను కలిగి ఉంది. హాంబర్గర్ ఐకాన్‌ ప్రెస్ (Hamburger Icon Press)చేయడం ద్వారా యూజర్లు అందుబాటులో ఉన్న నాలుగు ఎయిర్ క్వాలిటీ లేయర్స్‌(NO2, PM2.5, ఏరోసోల్, ఓజోన్)లో దేన్నయినా చూడవచ్చు. ఒక స్థానం కోసం యూరోపియన్ కోపర్నికస్ అట్మాస్పియర్ మానిటరింగ్ సర్వీస్ (European Copernicus Atmosphere Monitoring Service) లేదా CAMS నుంచి డేటా ఆధారంగా లేయర్స్ విజువలైజ్ (Visualize the layers)చేయబడ్డాయి. ఇలాంటి సమాచారం కోసం సంబంధిత వెబ్‌సైట్ (WEB SITE) కూడా మంచి సోర్స్ (SOURCE). ఈ యాప్ కూడా ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటికీ అందుబాటులో ఉంది.

(Eggs:కల్తీ కోడి గుడ్లతో సైడ్ ఎఫెక్ట్స్..)

BreezoMeter.. ఎయిర్ క్వాలిటీ యాప్ :

ఈ అవార్డ్ విన్నింగ్ యాప్‌ (Award winning app)లో స్ట్రీట్ (STREET), బ్లాక్ (BLACK) లేదా దేశ స్థాయిల్లో ఓపెన్ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంటుందో చూపగల రియల్ టైమ్ మ్యాప్స్ ఉన్నాయి. ఇది ప్రతిరోజూ గాలిలో పుప్పొడి రేణువుల సమాచారం సహా పరిసర వాయు కాలుష్యానికి మీరు బహిర్గతం కావడాన్ని తగ్గించేందుకు ఆరోగ్య సిఫార్సులను వ్యక్తిగతీకరిస్తుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లో అందుబాటులో ఉన్న యాప్.. ప్రపంచవ్యాప్తంగా 7,000కు పైగా అఫిషియల్ మానిటరింగ్ స్టేషన్స్ (Official Monitoring Stations)నుంచి గాలి నాణ్యత, పుప్పొడి, వాతావరణ కొలతలను సేకరిస్తుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -