- ఇంటిగ్రేటేడ్ కమాండ్ అండ్‌కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్‌లోని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం, ఇంటిగ్రేటేడ్ కమాండ్ అండ్‌కంట్రోల్ సెంటర్‌ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ అంక్షలు గురువారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఎన్టీర్‌భవన్-అపోలో ఆసుపత్రి, ఫిల్మ్‌నగర్-బంజారాహిల్స్ మీదుగా వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు ద్వారా రోడ్‌నెం. 36, రోడ్‌నెం 45 మీదా మాదాపూర్, హైటెక్ సిటీ వైపు వెళ్లాలని సూచించారు.
( చదవండి : టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్న ఎర్రబెల్లి సోదరుడు)
అలాగే మాసబ్‌ట్యాంక్ నుండి రోడ్ నెంబరు 12 వైపుగా వచ్చే వాహనదారులు బంజారాహిల్స్ రోడ్ నెం.1, రోడ్ నెం10 జహీరానగర్‌మీదుగా, బసవతారకం కాన్సర్ ఆసుపత్రిమీదుగా వెళ్లాలని తెలిపారు. ఫిల్మ్‌నగర్ మీదుగా ఒర్సి ఐస్‌ల్యాండ్ మీదుగా వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్‌ఎన్‌టీ, ఎన్‌ఎఫ్‌సీఎల్ మీదుగా పంజగుట్ట వైపు వెళ్లాలి. మాసబ్‌ట్యాంక్ మీదుగా రోడ్డు నంబర్ 12, జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనదారులు మెహిదీపట్నం, నానల్‌నగర్, టోలిచౌకి, ఫిల్మ్‌నగర్, జూబ్లిహిల్స్‌కు చేరుకోవాలి.
( చదవండి : ఎస్‌ఐపై దుండగలు కత్తితో దాడి)