transgender : ట్రాన్స్ జెండర్స్ అనగానే సమాజంలో చిన్న చూపు. వారు కనబడితే చాలు అపహాస్యపు నవ్వులు. సాటి మనుష్యుల్లగా కూడా వారిని పరిగనిం చకుండా హేళన చేస్తారు. ఇంట్లోను వారిది అరణ్య రోదనే. ప్రభుత్వానికి వారంటే చిన్నచూపే. కానీ కొందరు (transwomen) ట్రాన్స్ జెండర్స్ ఎంతో కస్టపడి తమ ట్రాన్స్ వర్గానికి అండగా నిలుస్తున్నారు. అనుకున్న లక్ష్యం సాధించి ఆదర్శంగా ఉంటున్నారు. బీహార్ కు చెందిన ముగ్గురు ట్రాన్స్ జెండర్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ గా మారారు. అనేక చిత్కారాలు ఎదుర్కొంటూ పట్టుబట్టి చదివి ఎస్సై లు అయ్యారు.
SI లుగా ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు
దేశ చరిత్రలో తొలిసారి ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఒకేసారి SIలు అయ్యారు. (bihar) బిహార్ పోలీస్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1,275 మంది పాస్ అయ్యారు. అందులో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. వారిలో ఇద్దరు (Birth) ట్రాన్స్‌మెన్ పుట్టుకలో ఆడ కాగా ఒకరు ట్రాన్స్‌ఉమెన్,పుట్టుకలో మగ, ఉన్నారు. గతంలో తమిళనాడు, కేరళలో ఒక్కో ట్రాన్స్‌జెండర్ SIలు అయ్యారు.