end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీTrojan SOVA : బ్యాంకింగ్‌ యాప్‌లకు వైరస్‌
- Advertisment -

Trojan SOVA : బ్యాంకింగ్‌ యాప్‌లకు వైరస్‌

- Advertisment -
- Advertisment -
  • అండ్రాయిడ్‌ మొబైల్‌ యూజర్లకు పెద్ద ప్రమాదం
  • అప్రమత్తంగా ఉండాలని పలు బ్యాంకింగ్‌ సంస్థలు హెచ్చరిక
  • యూజర్ల డాటా గోవిందా!

Trojan SOVA : ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లోకి(Android Mobiles) కొత్త ట్రోజాన్‌ వైరస్‌ (Trojan Virus SOVA) ప్రవేశించింది. ఇది చాలా ప్రమాదకరమైన ట్రోజాన్‌ వైరస్‌. ముఖ్యంగా మొబైల్‌ బ్యాంకింగ్‌ ఆప్‌లను (Banking Apps) టార్గెట్‌ చేస్తూ యూజర్స్‌ లాగిన్స్‌(users logins), పాస్‌వర్డ్‌లను దొంగలిస్తుందని ఇండియన్‌ సైబర్‌స్పేస్‌ రీసెర్చ్‌ యూనిట్‌ ఇంజనీర్స్‌ అన్ని బ్యాంకులకు, కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నారు. ఇది అండ్రాయిడ్‌లోని అక్సెసెబిలిటి సర్వీస్‌ (Android Accessibilty Service) ద్వారా బ్యాకింగ్‌ డేటాను చోరి చేస్తుంది. ఇదేగాకుండా ఫేక్‌ ఆప్‌ల(Fake Apps) రూపంలో మొబైల్‌లో తిస్టవేసి మొత్తం మొబైల్‌ ఆపరేషన్స్‌ను తన కంట్రోల్‌కి తీసుకుంటుంది. ఇంకా అతి పెద్ద ప్రమాదకరం ఎంటంటే మీరు మొబైల్‌లో జరిపే ప్రతీ యాక్టివిటీని ఇది గమనించి రికార్డు చేసుకొని హ్యాకర్స్‌లకు(Hackers) పంపిస్తుంది. ముఖ్యంగా నగదు లావాదేవీలకు సంబంధించి ఓటీపీలు(OTP), యాక్టివేషన్‌ కోడ్‌లను(Activation Codes) హ్యాకర్స్‌కు పంపిస్తుంది.

SOVA Trojan

పెద్ద ప్రమాదం ముంచి ఉంది

  • మీకు తెలియకుండానే మీ ఫోటోలు(Photo Gallery), వీడియోలు(Videos) హ్యాకర్ల సర్వర్‌లోకి అప్‌లోడ్‌ అవుతాయి
  • మీకు తెలియకుండా వీడియో రికార్డు(video record) చేస్తుంది
  • బ్రౌజర్‌లో ఉండే కుకీస్‌ను(Cookies) సేకరిస్తుంది
  • Android కీబోర్డు(Gboard) ద్వారా టైప్‌ చేసే ప్రతీ అక్షరాన్ని రికార్డు చేస్తుంది
  • మీకు తెలియకుండా మీ మొబైల్‌లోని అన్నింటిని స్ర్కీన్‌ షాట్‌(Screenshot) తీసుకుంటుంది
  • SMS Codes, OTP కోడల్‌లను కూడా క్యాప్టర్‌ చేస్తుంది
  • మొబైల్‌ స్ర్కీన్‌ లాక్స్‌(ScreenLock), పిన్‌ లాక్‌(PIN Lock) కోడ్‌లు, స్వైప్‌(Swipe Lock) లను కూడా రికార్డు చేసుకుటుంది
  • ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, బ్యాకింగ్‌ ఆప్‌ల OTP లను కూడా దొంగలిస్తుంది.
banking apps

మరేం చేయాలి

ప్రపంచంలో ఇండియాలోనే మొబైల్స్‌ మార్కెట్‌ ఎక్కువ. అతి తక్కువ ధరకే స్మార్ట్‌ ఫోన్లు లభిస్తుండడంతో చాలా మంది ప్రజలు ఏమి ఆలోచించకుండా ఏది పడితే అది కొనేస్తున్నారు. అనంతరం విచ్చలవిడిగా యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకొని వాడుతున్నారు. కానీ అందులో ఏది ఒరిజినల్‌ యాప్‌, ఏది ఫేక్‌ యాప్‌ అని కనుగొనలేకపోతున్నారు.

  • మొబైల్స్‌ యాప్‌లను కేవలం ఆథరైజ్డ్‌ డెవలపర్‌ సోర్స్‌(Authorized Developers Source) నుండి మాత్రమే డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి
  • యాప్‌ డౌన్‌లోడ్‌ చేసేముందు అది ఫేక్‌ లేదా ఒరిజినల్‌దా నిర్దారించుకోవాలి
  • SMS, ఈ-మెయ్సిల్‌, సోషల్‌ మీడియా, అడ్వర్‌టైజ్‌మెంట్‌ ద్వారా చూపించే యాప్‌లను అస్సలు డౌన్‌లోడ్‌ చేయకూడదు.
  • యాప్‌లు డౌన్‌లోడ్‌ చేశాక అన్ని పర్మిషన్‌లు (Accessibility) ఇవ్వకూడదు. అవసరమైన మేరకే ఇవ్వాలి. కొన్ని యాప్స్‌కు అసలు పర్మిషన్‌ ఇవ్వకూడదు
  • కచ్చితంగా మొబైల్‌ యాంటివైరస్‌ వాడాలి.
  • ఎప్పటికప్పుడు మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను(Mobile OS) , మొబైల్‌ యాప్స్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -