end
=
Tuesday, September 17, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంBad breath:నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..?
- Advertisment -

Bad breath:నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..?

- Advertisment -
- Advertisment -

ఈ చిట్కాలు పాటించండి

  • తడి లేని నోట్లో దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా(Bacteria) పెరగడానికి ఆస్కారం ఉంటుంది. డ్రై మౌత్‌లో సెలైవా లెవెల్స్‌ తక్కువగా ఉంటాయి. డ్రై మౌత్‌ సమస్య రాకుండా ఉండాలంటే రోజు 8 గ్లాసుల నీళ్లు తాగాలి.
  • కొన్ని రకాల ఆహారపదార్థాల వల్ల నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. అలాంటి ఆహారానికి దూరంగా ఉంటే మంచి ఫలితముంటుంది.
  • పాల ఉత్పత్తులు, మాంసం(Meat), చేపలు తీసుకోవడం తగ్గించాలి. కాఫీ, సిట్రస్‌ జ్యూస్‌లు, షుగరీ డ్రింక్స్‌(Soft Drinks)ను తక్కువగా తీసుకోవాలి.
  • దంత సమస్యలు లేకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా దంత వైద్యుణ్ణి కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి ఆరు నెలలకొకసారి డెంటల్‌ చెకప్‌(Dental Checkup), క్లీనింగ్‌ చేయించుకోవాలి.
  • స్మోకింగ్‌ వల్ల నోట్లో దుర్వాసన పెరురుతుంది. కనుక స్మోకింగ్‌ మానేస్తే ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.
  • ఆహారంలో పీచుపదార్థాలు(Fiber) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.
  • ప్రతి రోజు ఉదయాన్నే క్లీన్‌గా బ్రష్‌(Bresh) చేసుకోవాలి. టంగ్ క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోవాలి. సాయంత్రం వేళ కూడా బ్రష్‌ చేస్తే నోరు చాలా శుభ్రంగా ఉంటుంది.
  • ఈ చిట్కాలన్ని పాటిస్తే.. నోటి దుర్వాసన మీ దరిదాపుల్లోకి కూడా రాదు.

బరువు తగ్గాలనుకుంటున్నారా…?

ఎక్కిళ్లు వస్తున్నాయా.. అయితే ఇలా చేయండి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -