end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంటీఆర్‌ఎస్‌ కార్యకర్త బలి.. అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు
- Advertisment -

టీఆర్‌ఎస్‌ కార్యకర్త బలి.. అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు

- Advertisment -
- Advertisment -

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘోర పరాజయం పొందడంతో.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేని పార్టీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు చూస్తే.. దుబ్బాక నియోజకవర్గం, దౌల్తాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త స్వామి మంగళవారం రాత్రి.. పార్టీ ఓటమికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మంత్రి హరీష్‌ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, FDC చైర్మన్ ప్రతాప్ రెడ్డి స్వామి మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, అంతిమయాత్రలో పాల్గొని పాడే మోశారు.

అనంతరం, మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఓటమికి ఆత్మహత్యలు పరిష్కారం కావు, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోదామనీ.. కార్యకర్తలు అందరూ సంయమనంతో ఉండాలని సూచించారు. సహనం కోల్పోవద్దు. ధైర్యంతో ముందుకు పోవాలి టీఆర్ఎస్ కార్యకర్త స్వామి మరణ వార్త విని ఎంతో బాధపడ్డాను. కార్యకర్తలు కూడా మనోధైర్యం కోల్పోవద్దు. పార్టీ.. కార్యకర్తలను అందరిని కాపాడుకుంటుంది. మేము అందరం మీకు అండగా ఉంటామని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.

రాజకీయంలో గెలుపు ఓటములు సహజంగానే ఉంటాయి, కానీ అనుకోని సంఘటన జరిగినప్పుడు కార్యకర్తలు ఎవ్వరు కూడా ధైర్యం కోల్పోకుండా ఉండాలని కోరుతున్నాను. స్వామి చాలా చురుకైన కార్యకర్త మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాడు. రాత్రిం బవళ్లు పార్టీ కోసం కష్ట పడిన కార్యకర్త స్వామి కుటుంబానికి టీఆరెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఈ రోజు 2 లక్షల రూపాయలు తక్షణ ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందించాము. భవిష్యత్తులో కూడా స్వామి కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.

స్వామి పిల్లల చదువు వారి తల్లి కోరుకున్న విధంగా రెసిడెన్షియల్ స్కూల్ లో చదివిపిస్తామన్నారు. స్వామి భార్యకు, పిల్లలకు అండగా ఉంటామని హరీష్‌ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి ఎంతో భవిష్యత్ ఉన్నది. ఎన్నో ఎన్నికల్లో గెలిచాము. కొన్ని సందర్భాలలో ఓటమిని కూడా రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. టీఆర్‌ఎస్‌ ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఒడినప్పుడు కుంగిపోకూడదు. స్పోర్టివ్ గా తీసుకోవాలని మంత్రి హరీష్‌ కార్యకర్తలకు సూచించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -