- ఎమ్మెల్యే రఘునందన్
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క పొగడడం, భట్టి విక్రమార్కను కేసీఆర్ పొగడడం మున్ముందు రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన ఆశ్యర్య పోనవసరం లేదని బీజెపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని ఇది ప్రజలు గమనించాలని సూచించారు. ప్రతీ జిల్లాలో పరిరక్షణ దీక్ష చేపడుతామని వెల్లడించారు.
రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీర్‌కు గజ్వేల్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తాను దుబ్బాకలో పోటీ చేసినప్పుడు టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎన్నో విమర్శలు చేశారని, కానీ ప్రజల ఆశీస్సులతో బీజెపీని గెలిపించారని ఆయన గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా గజ్వేల్‌లో బీజెపీ గెలిచి టీఆర్‌ఎస్‌కు దిమ్మతిరిగేలా ప్రజలు సమాధానం చెబుతారని ఆయన అన్నారు.