end

ఉద్యమకారులను టీఆర్‌ఎస్‌ పట్టించుకోదు

తెలంగాణ కార్యసాధనలో ఎంతో శ్రమకోర్చి, నూతన రాష్ట్రాన్ని సాధించుకున్నాక టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేసీఆర్‌ నమ్ముకొని చాలామంది మోసపోయారని మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ వ్యాఖ్యానించారు. అస్సలు ఉద్యమంలో లేని నాయకులకు ప్రప్రథమ స్థానాన్ని ఇస్తున్నారన్నారు. అసలు సిసలు ఉద్యమకారులను టీఆర్‌ఎస్‌ ఎప్పుడోమరిచిపోయిందని ఆయన ఆవేదనగా అన్నారు. నిన్న సాయంత్రం ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులు కనీస మర్యాదకు కూడా నోచుకోలేదా అని ఆయన ప్రశ్నించారు.

ఉద్యమకారుల ఆత్మాభిమానాన్ని కాపాడడానికే బీజేపీలో చేరనని ఆయన అన్నారు. తాను పదవుల కోసం పాకులాడడం లేదన్నారు. గత రెండేళ్లలో కనీసం వంద సార్లు సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించానని, ఆత్మాభిమానం దెబ్బతిన్నందువల్లే టీఆర్‌ఎస్‌ ను వీడానని స్వామిగౌడ్ తెలిపారు.

Exit mobile version