తాము(ఎంఐఎం పార్టీ) తలుచుకుంటే 2 నెలల్లో టీఆర్‌ఎస్‌ను గద్దె దించుతామని ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీని, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్‌ను చులకన చేసి మాట్లాడిన ఎంఐఎం ఎమ్మెల్యే.. ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు టీఆర్‌ఎస్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కేవలం 7గురు ఎమ్మెల్యేలున్న మీరు మా ప్రభుత్వాన్ని ఏమి చేయలేరని బాహటంగానే విమర్శిస్తున్నారు. మంత్రి కేటీఆర్ రాజకీయాలకు కొత్తనో.. పాతనో, బడానో… బచ్చానో ఆయన రోడ్‌షోలకు వస్తున్న ఆదరణ చూసి మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణలోనే అత్యంత చరిష్మా కలిగిన యువనేత కేటీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
రెచ్చగొట్టే మాటల వల్ల తాము ఎంఐఎం ట్రాప్‌లో పడమన్నారు టీఆర్‌ఎస్ నాయకులు. 7 ఎమ్మెల్యే సీట్లున్న పార్టీ తమ ప్రభుత్వాన్ని పడగొడతామనడం హాస్యాస్పదంగా ఉందని తలసాని వ్యాఖ్యానించారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్ హెచ్చరించారు.