- హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు!
- ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర సంతాపం!
టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎం సుదర్శన్‌రావు (62) బుధవారం ఉదయం ఆయన గుండెపోటుతో మృతిచెందారు. ఇంట్లోనే ఉన్న ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటీనా ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కాగా సుదర్శన్‌రావు మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలో సుదర్శన్ చాలా అద్భుతంగా పనిచేశారని సీఎం గుర్తు చేశారు. కాగా ఆయన 2009లో కూకట్‌పల్లి నుండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. సుదర్శన్‌రావు మృతి పట్ల పలువురు ప్రముఖులు, నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.