end
=
Saturday, January 18, 2025
రాజకీయంమేము దీక్ష కి రెడీ అంటున్న మంత్రులు
- Advertisment -

మేము దీక్ష కి రెడీ అంటున్న మంత్రులు

- Advertisment -
- Advertisment -

ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు నేడు దీక్ష చేపట్టబోతోంది. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నేతలు ఇవ్వాళ ఢిల్లీలో దీక్ష చేయనున్నారు.. తెలంగాణ భవన ప్రాంగణం వేదికగాచేయనున్న దీక్షలో సీఎం కేసీఆర్‌ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. దీనికోసం ఇప్పటికే టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సహా దాదాపుగా నేతలందరూ ఢిల్లీ చేరుకున్నారు. మరికొందరు సోమవారం ఉదయం చేరుకోనున్నారు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిరసన దీక్ష జరుగుతుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

ఈ దీక్షకు టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. దీక్షా వేదికపై ధాన్యం బస్తాలను పెట్టి నిరసన తెలపనున్నారు. దీనికోసం కావలిసిన ధాన్యాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ నుంచి తీసుకొచ్చారు. వేదికపై సీఎంతో పాటు కేటీఆర్‌, పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు కిసాన్‌నేత రాకేశ్‌ టికాయత్‌ తదితరులు కొద్దరే ఉంటారు.

రైతులను క్షోభ పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతుల కోపా జ్వాలలను కేంద్రం తక్కువ అంచనా వేయడం తగదని, తమ మాటే నెగ్గాలనే ధోరణిలో ఉండకూడదని సూచించారు.. తెలంగాణలో పండిన యాసంగి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా సేకరించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -