- అన్ని మతాలకు సంక్షేమ పథకాలు
- వివేకానంద విద్యా పథకం ద్వారా స్కాలర్షిప్లు మంజూరు
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు(Telangana Brahmin Welfare Council) ఆధ్వర్యంలో వివేకానంద విదేశీ విద్యా పథకం అర్హులకు స్కాలర్ షిప్(Scholarship) మంజూరు పత్రాలను అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Harishrao) హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘గత పాలకులు ఉన్నత వర్గాల్లోని పేదల గురించి మాట్లాడే ధైర్యం చేయలేదు. కులం మతంతో సంబంధం లేకుండా తెలంగాణలో ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం. ముందు కళ్యాణ లక్ష్మి దళితులతో మొదలుపెట్టి ఇప్పుడు తెలంగాణలోని పేదవారందరికీ అందిస్తున్నాం. ఓవర్సీస్(Overseas) స్కాలర్ షిప్ కూడా దళిత వర్గాలకు ఇచ్చిన సమయంలోనే పేదలుగా ఉన్న అన్ని వర్గాలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందిస్తున్నాము. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) గారికి బ్రాహ్మణుల పట్ల గురువుల పట్ల అపారమైన గౌరవం మొదటి నుంచి ఉంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దేశంలోనే మొట్టమొదటిసారి బ్రాహ్మణ సమాజ సామూహిక భవనాన్ని సిద్దిపేట(Siddipet)లో నిర్మించారు. అని వర్గాల సంక్షేమం కోసం అలోచించే మన ముఖ్య మంత్రి కెసిఆర్ గారు నిజమైన హిందూ ధర్మ పరిరక్షకులు. మిగితా వారు రాజకీయాల కోసం హిందూ మతాన్ని వాడుకుంటారు.
దేశంలో ప్రభుత్వం గుడి కట్టిన ఒకే ఒక రాష్ట్రం మన తెలంగాణ మాత్రమే. మన ముఖ్య మంత్రి కెసిఆర్ గారు రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో ఉన్న అన్ని దేవాలయాలను అభివృద్ధి చేశారు. అర్చకులకు పుణ్య కార్యం జరిగితేనే జీతాలు వచ్చే పరిస్థితి ఉండేది కానీ ఇపుడు మన ముఖ్య మంత్రి గారు ప్రతీ నెల అర్చకులకు జీతాలు సమయానికి వచ్చే వ్యవస్థ ఏర్పాటు చేశారు. వివేకానంద ఓవర్సీస్ స్కాలర్ షిప్(Vivekananda Overseas Scholarship) వచ్చిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. కష్టపడి బాగా చదువుకోవాలని మీ అందరికీ బ్రాహ్మణ బంధువుగా అండగా ఉంటూ బ్రాహ్మణ పరిషత్ సమస్యలు మీరు కోరినట్లు పరిష్కరిస్తా’మని వెల్లడించారు. ఇంకా స్కాలర్ షిప్, ఇతర పథకాల గురించి మాట్లాడుతూ ‘ఈ ఏడాది 121 మందికి రూ. 24.20 కోట్లు మంజూరు అయ్యాయి. ఒక్కో విద్యార్దికి రూ. 20 లక్షల వరకు ప్రభుత్వం ఆర్ధిక సాయం(Financial assistance) అందిస్తుంది. ఇప్పటివరకు 617 మంది లబ్దిదారులకు రూ. 64.24 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.
ఇంటర్ ఆపై చదువుకునే పేద బ్రాహ్మణ విద్యార్ధులకు రీయింబర్స్‌మెంట్(Reimbursement), వేద విద్యార్ధులకు నెలకు రూ. 250, వేద విద్య పూర్తయ్యాక వృత్తిలో నిలదొక్కుకునేందుకు మూడు నుంచి నాలుగు లక్షల ఆర్ధిక సాయం, వేద పాఠశాలల్లో మౌలికవసతుల కోసం గరిష్టంగా రెండు లక్షలు, నిరుద్యోగులకు గ్రూప్ 1 ఉచిత కోచింగ్ తో పాటు నెలకు రూ. 5 వేలు, ఇతర ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేవారికి నెలకు రూ. 2 వేల సాయం, చిరు వ్యాపారాలు(Small Business) పెట్టుకోవడానికి 60 నుంచి 80 శాతం సబ్సిడీతో ఇప్పటివరకు 3647 మందికి రూ. 104 కోట్ల లబ్ది జరిగింది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే 18 మందితో బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు, సూర్యాపేట, సిద్ధిపేట, ఖమ్మంలో బ్రాహ్మణ భవనాలు నిర్మించుకున్నాం. హైదరాబాదులోని గోపన్ పల్లిలో 6 ఎకరాల విస్తీర్ణంలో రూ. 20 కోట్ల వ్యయంతో కొత్త బ్రాహ్మణ భవన్ ప్రారంభానికి సిద్దంగా ఉంది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు ప్రతీ ఏటా రూ. 100 కోట్లు(100 Crores) ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, మాజీ మంత్రి మధుసూదనాచారి, ఎండోమెంట్ కమిషనర్ అనిల్, సీఎం సిపిఆర్ఓ నర్సింగరావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, దేవి ప్రసాద్, బ్రాహ్మణ పరిషత్ నాయకులు హాజరయ్యారు.
(UPSC: UPSC కేంద్ర శాఖల్లో ఖాళీల భర్తీ)