end

ట్రంప్‌ కల.. కలగానే మిగిలిపోనుందా..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గి, రెండో సారి వైట్‌హౌస్‌లో అడుగుపెడామనుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ కల.. కలగానే మిగిలేట్టుంది. ఎందుకంటే అతని ప్రత్యర్థి డెమోక్రటిక్‌ నేత జో బైడెన్‌ విజయానికి చేరువలో ఉండగా.. ట్రంప్‌ మాత్రం ఆమడ దూరంలో ఉన్నారు. అమెరికా అధ్యక్ష పదవిని అధిష్ఠించే అవకాశం ఎవరికైనా కేవలం రెండుసార్లు మాత్రమే ఉంటుంది. ఎలాగైనా ఈ సారి గెలిచి చరిత్ర తిరగరాద్దామనుకున్న ట్రంప్‌ డీలా పడ్డాడు. తన అహంకారపూరిత ధోరణే ఇందుకు కారణం కావచ్చు. అమెరికాకు అధ్యక్షుడయ్యే భాగ్యం రెండు సార్లు మాత్రమే ఉంటుంది. ఆ కలను నెరవేర్చుకుందామని ఆది నుంచి తీవ్రంగా కృషి చేస్తున్నారు ట్రంప్‌ అండ్‌ కో.

క్రితం సారి ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ నాలుగుసార్లు అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించినప్పుడు చాలా మంది దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, అమెరికా రాజ్యాంగానికి 22వ సవరణ చేయడం ద్వారా.. ఎవరైనా రెండుసార్లు మాత్రమే అమెరికా అధ్యక్షుడయ్యేలా నిబంధనలు సవరించారు. ఇటీవలికాలంలో బిల్‌ క్లింటన్‌, జార్జ్‌బుష్‌ జూనియర్‌, ఒబామా.. రెండేసిసార్లు చొప్పున అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. 1992లో జార్జ్‌ బుష్‌ సీనియర్‌.. రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ పడి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు.. 28 సంవత్సరాల తర్వాత.. అదే కోవలో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమికి చేరువలో ఉన్నారు.

ఆయన ఓటమి ఖరారైతే.. 2024లో జరిగే ఎన్నికల్లో పోటీ పడొచ్చా? అంటే.. నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చు. ఒకవేళ 2024లో ఆయన పోటీ చేసి గెలిస్తే అదే ఆఖరుసారి అవుతుంది. గతంలో అలా ఒక టర్మ్‌ విరామం తర్వాత రెండోసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన అధ్యక్షుడొకరు ఉన్నారు. ఆయన పేరు.. బెంజమిన్‌ హారిసన్‌. ఆయన 1885 నుంచి 1889 దాకా మొదటిసారి, 1893 నుంచి 1897 దాకా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఒకవేళ ట్రంప్‌ 2024లో పోటీ చేసి గెలిస్తే అదీ ఒక కొత్త చరిత్రే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version