end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంఆర్‌వోఆర్ స్థానంలో 'రైట్స్‌' బిల్లు..
- Advertisment -

ఆర్‌వోఆర్ స్థానంలో ‘రైట్స్‌’ బిల్లు..

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌ : రైతులకు భూమిపై పూర్తి భరోసా కల్పించడంతో పాటు పాలనా పరంగా ఇబ్బందులు లేకుండా హక్కు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రైట్స్‌ ఇన్‌ లాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ బిల్లును ప్రవేశపెడుతోంది. సోమవారం జరిగిన కేబినెట్‌ భేటీ ఆమోద ముద్ర వేసిన ఈ బిల్లు బుధవారం అసెంబ్లీ ముందుకు రానుంది. తెలంగాణ రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌వోఆర్‌) ఇన్‌ లాండ్‌ అండ్‌ పట్టాదారు పాస్‌బుక్స్‌ యాక్ట్‌ స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నారు. వాస్తవానికి 1971 ఆర్‌వోఆర్‌ చట్టానికి 1989, 1993లోకూడా సవరణలు జరిగాయి.

పెద్దపులి దాడిలో ఆవు మృతి

ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక 2016 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించిన 277 చట్టాల్లో ఆర్‌వోఆర్‌ చట్టం ఒకటి. రైతులకు భూమిపై హక్కు కల్పించడంతోపాటు పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్‌ డీడ్‌ జారీ చేయడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఈ క్రమంలో చోటుచేసుకుంటున్న ఇబ్బంది, అవినీతి అక్రమాల నేపథ్యంలోనే కొత్త చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. కాగా, బుధవారం ఈ బిల్లుతోపాటు వీఆర్‌వో వ్యవస్థ రద్దు బిల్లు, తెలంగాణ మున్సిపల్‌ (సవరణ) బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్‌ (సవరణ) బిల్లులను కూడా శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు అసెంబ్లీ అజెండాలో చోటు కల్పించారు.

శాండిల్‌వుడ్‌ డ్రగ్‌ కేసులో నటి సంజనా అరెస్టు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -