end

జులైలో ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్షలు

  • తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడి

తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఈ మేరకు ప్రకటించారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రి, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జులై 14 నుండి ఎంసెట్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విద్యార్థులకు జులై 14, 15, అలాగే ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు జులై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్‌ నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మే నెలలో పదోతరగతి, ఇంటర్‌ పరీక్షలు జరగనున్నందున ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్షలను జులైలో నిర్వహించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సబితా తెలిపారు.

ఇందుకోసం 23 రీజినల్‌ సెంటర్ల పరిధిలో 105 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన అభ్యర్థులు నేరుగా ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరంలో చేరడానికి నిర్వహించే ఈసెట్‌ను జులై 13న నిర్వహిస్తామని వెల్లడించారు. ఎంసెట్‌ నోటిఫికేషన్‌, దరఖాస్తు గడువు, ఫీజు తదితర వివరాలను త్వరలో సెట్‌ కన్వీనర్లు ప్రకటిస్తారని మంత్రి వివరించారు.

Exit mobile version