- రూ.600 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు గృహనిర్మాణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ.600 కోట్లను విడుదల చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో గవర్నమెంట్ రూ.3,750 కోట్లను కేటాయించింది.
వికారాబాద్‌లో ప్రేమికులు ఆత్మహత్య
ఇందులో భాగంగా గతంలో రూ.150 కోట్లు రిలీజ్ చేయగా.. తాజాగా మరో రూ.600కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కాగా తెలంగాణ సర్కార్ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అర్హులైన పేదలకు పలుచోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. చాలా చోట్ల ఆ ఇళ్ల నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.