వర్షాల కారణం గా ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి తెల్సిందే. అందుకే ఆర్టీసీ వాళ్లు ఒక మంచి ఆలోచన చేశారు అది మహిళలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్సిల్ సర్వీసుల ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది. ప్రజలకు ఆర్టీసీపై నమ్మకం పెంచడానికి అధికారులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్టీసీకి పేరు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా సజ్జనార్ ఆర్టీసీ ఎండీ అయ్యాక కొత్తకొత్త కార్యక్రమాలు చేపడుతూ ఆర్టీసీపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యను పెరగడానికి సంస్థ ఎండీ సజ్జనార్ ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేశారు. కొత్తకొత్త కార్యక్రమాలు చేపట్టి ప్రజల మెప్పును పొందుతున్నారు. రకరకాల ఆఫర్లు ప్రకటిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. తాజాగా మరో మంచి ఆఫర్ ప్రకటించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది.
రాఖీ పౌర్ణమి రోజున మహిళలు వారి సోదరులకి స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని పరిస్థితులు ఉన్నవారికి టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్సిల్ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరలకే రాఖీలను పంపించుకోవచ్చని ప్రకటించింది. టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్సిల్ సర్వీసుల ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది. దీని గురించి పూర్తి సమాచారం కోసం 9154298858, 9154298829 నంబర్లలో సంప్రదించాలని టీఎస్ ఆర్టీసీ సూచించింది.
గ్రామాల నుండి హైదరాబాద్ రాలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని వివరించింది. మహిళలకు తెలంగాణ ఆర్టీసీ ఎప్పుడూ తోడు ఉంటుందని అందుకే వారికి ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు ఆర్టీసీ తెలిపింది.