end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంతెలంగాణలో రోడ్డెక్కెనున్న సిటీ బస్సులు?
- Advertisment -

తెలంగాణలో రోడ్డెక్కెనున్న సిటీ బస్సులు?

- Advertisment -
- Advertisment -
  • సెప్టెంబర్‌ నెలాఖరుకల్లా సిటీ బస్సులు ప్రారంభం
  • ప్రయాణీకులు కచ్చితంగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలి

కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ వల్ల నిలిచిపోయిన బస్సులను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఈ నెల 7న కేంద్రం ప్రజా రవాణా వ్యవస్థకు అనుమతినిచ్చింది. ఇప్పటికే తెలంగాణలో జిల్లా బస్సులు తిరుగుతుండగా తాజాగా హైదరాబాదులో సిటీ బస్సులను కూడా నడిపేందుకు తెలంగాణ ఆర్టీసి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆరు నెలలుగా మూలన పడ్డ సిటీ బస్సులను సర్వీసు చేస్తున్నారు.

ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు; మగ్గురు మృతి

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కర్ణాటక రాష్ర్టాలలో సిటీ బస్సులు తిరిగే విధానాలను అధ్యయనం చేసి ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 50 శాతం బస్సులను మొదట నడపనున్నట్లు సమాచారం. అయితే సిటీ బస్సులను ఎక్కువగా రద్దీ ఉండే ప్రధాన రూట్లలో నడిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

సెల్ఫీఫోటో దిగబోయి వాగులో గల్లంతు…

ప్రయాణీకుల తాకిడి అనుసరించి సర్వీసులను పెంచడం జరగుతుంది. లాక్‌డౌన్‌ వల్ల తెలంగాణ ఆర్టీసి ఖాజానాకు గండి పడింది. ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వడం కష్టతరంగా మారడం వల్ల ఇక ఎక్కువ రోజులు వేచి చూడకుండా వీలైనంత త్వరగా హైదరాబాదులో సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించడానికి రంగం సిద్దమవుతోంది. అయితే కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రయాణీకులు కచ్చితంగా కోవిడ్‌ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

ఎస్పీ బాలు ఆరోగ్యం మెరుగు

ముఖానికి మాస్క్‌ తప్పనిసరి, చేతులు శానిటైజేషన్‌ చేసుకోవాలి. ప్రతీ స్టేజి వద్ద ఆర్టీసి ఉద్యోగి ప్రయాణీకుల ఆరోగ్య పరిస్థితి చూసిన తర్వాతనే బస్సులోకి అనుమతిస్తారు. బస్సులో నిలబడి ప్రయాణించడం నిషేధం. తెలంగాణ ఆర్టీసి అధికారులు సెప్టెంబర్‌ నెలాఖరుకల్లా హైదరాబాదులో బస్సులు నడిపించాలని సీఎం కేసీఆర్‌తో చర్చించినట్లు ఆర్టీసి వర్గాలు వెల్లడించాయి.

నిరుద్యోగులకు కేంద్రం తీపి కబురు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -