end

దసరా పండుగకు TSRTC ప్రత్యేక బస్సులు

  • 3 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్న టీఎస్‌ఆర్టీసీ
  • ప్రయాణీకులు కచ్చితంగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలి
  • ఎంజీబిఎస్‌, జెబీఎస్‌, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌ నుండి ప్రత్యేక బస్సులు

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

తెలంగాణ ఆర్టీసి దసరా పండుగ సందర్భంగా రాష్ర్ట్ వ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసి అధికారులు తెలిపారు. తెలంగాణలో అత్యంత పెద్ద పండుగగా జరుపుకునే ప్రజలు తమ స్వంత ఊళ్లకు వెళ్లేందుకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా హైదరాబాద్‌ నుండి వివిధ జిల్లాలకు దాదాపు 3 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి ఆర్‌ఎం వరప్రసాద్‌ తెలిపారు. ప్రతీ సంవత్సరం దసరా, సంక్రాంతి పండుగలకు హైదరాబాద్‌ నగరం నుండి ప్రజలు తమ గ్రామాలకు వెళతారని దీంతో ఎంజీబిఎస్‌, జెబీఎస్‌ వద్ద ప్రయాణీకులు పెద్ద సంఖ్యలో ఉంటారని, వారిని తమ తమ ఊళ్లకు పంపే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.

వినియోగదారులకు పేటిఎం షాక్‌

అయితే ఈ సంవత్సరం కరోనా వైరస్‌ కారణంగా కొంత రద్దీ తగ్గవచ్చని అయినాగానీ ఆర్టీసి బస్సులలో కచ్చితంగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు గుమిగూడడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రయాణీకులు కచ్చితంగా ముఖానికి మాస్కు పెట్టుకోవాలని, చేతులు శానిటైజ్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా అక్టోబర్‌ 24 వరకు ఎంజీబిఎస్‌, జెబీఎస్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎస్సార్‌‌నగర్‌, అమీర్‌పేట్‌, ఈసీఐఎల్‌, ఉప్పల్‌ క్రాస్‌రోడ్, ఎల్బీ నగర్‌ నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరతాయని తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ కూడా కల్పించామని వివరించారు.

చెన్నై ఢమాల్‌.. రాజస్తాన్‌ ఘనవిజయం

బస్‌ రూట్లలో మార్పులు

దసరా పండుగ నేపథ్యంలో వివిధ రూట్లలో అధికారులు పలు మార్పులు చేశారు. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల వైపు వెళ్లే షెడ్యూల్‌, స్పెషల్‌ బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్‌, జేబీఎస్‌ నుంచి నడుస్తాయి. యాదగిరిగుట్ట, జనగాం, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్‌, తొర్రూర్‌, వరంగల్‌ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌, ఉప్పల్‌ బస్‌ స్టేషన్‌ నుంచి నడువనున్నాయి. మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు వెళ్లే బస్సులు దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి నడుస్తాయని ఆర్‌ఎం వరప్రసాద్‌ తెలిపారు.

ఆ హీరోయిన్‌ బయోపిక్‌లో సాయిపల్లవి..!

Exit mobile version