end

జూన్‌ 12న TS TET

TET
Teacher Eligibility Test

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) జూన్‌ 12న నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లను మార్చి 26 నుండి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ పోస్టులపై ఆర్థిక మంత్రి హరీష్‌రావు, సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించి వీలైనన్ని ఉద్యోగాలకు అనుమతులు ఇవ్వాలని శాసనసభలో ఆదేశాలు జారీ చేశారు. మంత్రి హరీష్‌రావు కూడా ఆయా శాఖల అధికారులతో చర్చలు జరిపారు. తొలివిడతలో 30 వేల 453 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు జారీ చేసింది. శాఖల వారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతులిస్తూ జీవోలు కూడా జారీ చేశారు. హోంశాఖ, జైళ్లు, రవాణా, వైద్య ఆరోగ్యం, ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) నిర్వహణకు కూడా ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది.

Exit mobile version