end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంతూప్రాన్ పట్టణం ఆదర్శ మున్సిపాలిటీగా రూపుదిద్దుకోవాలి
- Advertisment -

తూప్రాన్ పట్టణం ఆదర్శ మున్సిపాలిటీగా రూపుదిద్దుకోవాలి

- Advertisment -
- Advertisment -

తూప్రాన్ లో గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి

వెబ్‌డెస్కు :  సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులు, పట్టణ ప్రజాప్రతినిధులపై ఎంతైన ఉందని గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి అన్నారు. తూప్రాన్ లో సోమవారం చైర్మన్ రాఘవేందర్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఆర్డీఓ శ్యామ్ ప్రకాశ్, తహసీల్దార్ శ్రీదేవి, పీఆర్ ఈఈ రామచంద్రారెడ్డి, విద్యుత్ శాఖాధికారులతో పట్టణ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

పోలవరం పెండింగ్‌ నిధలు విడుదల చేయండి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూప్రాన్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అర్బన్ పార్క్, డంపింగ్ యార్డులు, వైకుంఠ దామాలు, విద్యుత్ స్తంభాలు, రైతు వేదిక, పెద్ద చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. భవిష్యత్లో పట్టణ ప్రజల కోసం అవసరమైన భూములు సేకరించి మున్సిపల్ శాఖకు అప్పగించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ ఖాజా మోజియోద్దీన్ , పీఆర్ డీఈ నర్సింలు, ఏఈ విజయ్ ప్రకాశ్  ,విద్యుత్ ఏఈ వెంకటేష్,కౌన్సిలర్లు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -