end
=
Sunday, January 19, 2025
ఫీచ‌ర్స్ ‌వినోదం కాదు...అంతా వివాదమే
- Advertisment -

వినోదం కాదు…అంతా వివాదమే

- Advertisment -
- Advertisment -
  • గాడి త‌ప్పుతున్న నేటీత‌రం సీరియ‌ల్‌లు….
  • విల‌నిజం పాత్ర‌లకే ప్రాధాన్యం…
  • అనుక్ష‌ణం ఉత్కంఠ భ‌రితం…

వినోదాన్ని పంచాల్సిన టీవీ సీ‌రియ‌ళ్లు… ప‌గ‌, ప్ర‌తీ కారాల‌ను ప్రేరేపిస్తున్నాయి. కుటుంబీకుల మ‌ధ్య ప్రేమానురాగాలు స‌న్న‌గిల్లి అనుమాన బీజాలు నాటుతున్నాయి. దాదాపు అన్ని సీరియ‌ళ్లు మ‌హిళా విల‌నిజం పునాదిపైనే నెల‌ల కొద్దీ ప్ర‌సార‌మ‌వుతున్నాయి. అత్తా కోడ‌ళ్ల పంచాయ‌తీలు, అన్న‌ద‌మ్ముల ఆస్తి వివాదాలు, భార్య భ‌ర్త‌ల క‌ల‌హాలు…వెర‌సీ అనుబంధాలు ‌తగ్గిపోయి టీవీల‌కు బందీల‌వుతున్న ప‌రిస్థితి స‌ర్వ‌త్రా అందోళ‌న క‌లిగిస్తోంది.

లారీని అపహరించుకెల్లారు..

ఏ సీరియ‌ల్ చూసినా ఏముంది గ‌ర్వ‌కార‌ణం….వినోదం లేదు… సందేశం లేదు…అంతా వివాద‌మే. ఏడుపుగొట్టు క‌థ‌నాలు. అనుక్ష‌ణం ఉత్కంఠ‌, మాన‌సిక అందోళ‌న త‌ప్పా ఏమీలేదు. సమాజాన్ని స‌రైన మార్గంలో న‌డిపించెందుకు దోహ‌ద‌ప‌డాల్సిన సీరియ‌ల్‌లు గాడి తప్పుతున్నాయి. ప్రేమ‌లు, అనురాగాలు, అప్యాయ‌త‌లు కాన‌రావ‌డం లేదు. పాల‌ల్లో విషం ఇవ్వ‌డం, క‌రెంట్ షాక్, లారీతో గుద్దించ‌డం, క‌త్తుల‌తో దాడి చేసి చంపేయ‌డం, వివాహేత‌ర సంబంధాలు పెట్టుకోవ‌డం వంటి క‌థ‌నాలే  నేటీ సీరియ‌ల్‌లో ఎక్కువ‌గా క‌న‌బడుతున్నాయి.

సెప్టెంబర్‌ 7 నుండి అన్‌లాక్‌ 4.0

నేటీ త‌రం ఇల్లాలు వారికి న‌చ్చిన సీరియ‌ల్‌లు టైమ్ రాగానే అటేన్ష‌న్ అవుతున్నారు. ఎన్ని ప‌నులు ఉన్నా ప‌క్క‌న పెట్టి టీవీ ఆన్ చేస్తున్నారు. నేడు ఏమి జ‌రుగుతుందోన‌న్న అత్రుత‌లో గడిపేస్తున్నారు. అయితే విషాద‌మేమింటే నేటీ సీరియ‌ల్‌లు చూసి స‌మాజం నేర్చుకోద‌గిన అంశాలేవి ఉండ‌డం లేదు. కోరుకున్న వినోదం కూడా ల‌భించ‌డం లేదు. కేవలం ప‌గ‌, ప్రతికారం, హింస ఇలాంటి అంశాల‌నే చూపిస్తున్నారు. ఒక‌ప్పుడు సినిమాల‌కు ప్రత్యామ్నా యంగా సీరియల్‌లు ఉండేవి. అప్ప‌ట్లో అంతా మంచి మంచి కార్య‌క్ర‌మాలు ప్ర‌సార‌మ‌య్యేవి. హిందీలో హ‌మ్‌లోగ్‌, బునియాది, రామాయ‌ణ్‌, మ‌హాభార‌త్‌, స‌ర్క‌స్ వంటి సీరియ‌ల్‌లో ఏదో ఒక సందేశాన్ని జ‌నాల‌కు అందించాయి. తెలుగులో రుతురాగాలు, చ‌క్ర‌వాకం, మొగిలిరేకులు, రాధా-మ‌ధు లాంటి క‌థా బ‌లం క‌లిగిన సీరియల్‌లు ఎంత‌గానో అకట్టుకున్నాయి.

రుచికరమైన చేపలు, గోంగూర కర్రీ

అనందో బ్రహ్మ‌, అమృతం లాంటి హ‌స్య సీరియల్‌లు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అక‌ట్టుకున్నాయి. కానీ నేటీ త‌రంలో ప్ర‌సార‌మ‌య్యే సీరియ‌ల్‌లో అలాంటి క‌థ‌నాలు క‌లిగిన మ‌చ్చుకైనా క‌నిపించ‌వు. జనాలను టెన్ష‌న్‌లో పెట్టి పిచ్చేక్కిస్తున్నాయి. నేటీ త‌రం సీరియల్‌లో ఖ‌చ్చిత‌మైన మార్పు రావా లంటూ విద్యావేత్త‌లు కొరుతున్నారు. స‌మాజ‌హిత‌మేన క‌థ‌నాలు ప్ర‌సారం జ‌రిగేలా చూడాల‌ని నిపుణుల‌ను సూచిస్తున్నారు.

కాస్టింగ్‌కౌచ్‌లో అనుష్క !?

కుటుంబాన్ని బ‌జారు పాలుచేయ‌డమే

మ‌హిళా కార్య‌క్ర‌మాలు త‌ప్ప‌క ఉండాల్సిందే. కానీ వినోదం పేరుతో ప్రాథ‌మిక పాఠ‌శాల స్థాయిలో కూడా ఆడ‌ని, అర్థం లేని ఆట‌పాట‌లు, కార్య‌క్ర‌మాలు సీరియ‌ల్‌లో రావడం స‌బ‌బుకాద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రీ ముఖ్యంగా చ‌ట్టాలు కూడా అక్షేపించే విధంగా వైవాహిక జీవితంలో ఓడిన వారి జీవితాల‌ను ప్ర‌సార మ‌ధ్య‌మాల ద్వారా ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డం స‌రైంది కాదు. ఇప్ప‌టికే సీరియల్‌తో కుటుంబ విలువ‌లు మంట క‌లుస్తున్నాయి. అనుకుంటే ర‌చ్చ‌బండ లాంటి కార్య‌క్ర‌మాలు కుటుంబాల‌ను బ‌జారుకీడుస్తున్నాయి. ఇరు కుటుంబాలు ఎటువంటి అభ్యంత‌రం చెప్ప‌లేద‌నే కార‌ణం చేత‌, కుటుంబ స‌భ్యులంద‌ర్ని తెర‌ముందుకు తెచ్చి బ‌జారు పాలుచేయ‌డం త‌గ‌దు. న్యాయ సాధ‌నాల మాదిరి వైవాహిక జీవితానికి సంబంధించిన తీర్పులు చెప్ప‌డం, వారిని భ‌యబ్రాంతుల‌కు గురిచేయ‌డం క‌రెక్ట్ కాదు.

మ‌హిళా విల‌న్లు

ఏ సీరియ‌ల్ చూసినా ప్ర‌తి విల‌నిజంలో మ‌హిళ‌లు ప్ర‌థ‌మ శ్రేణిలో ఉంటున్నా‌రు. పురుఫులు రెండో శ్రేణి పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వ్యూహ‌ర‌చ‌న మ‌హిళా విల‌న్లు చేస్తే పురుషులు అమ‌లు చేస్తున్నారు. విల‌న్లు వేసే జిత్తులు అర్థం చేసుకోలేని శుద్ద ద‌ద్ద‌మ్మ‌లుగా నాయికా నాయ‌కులు పాత్ర‌లు మిగిలిపోతున్నాయి. ప్ర‌తి సీరియ‌ల్‌లో ఓ నీలాంబ‌రి, భ‌వాని, చంద్ర‌ముఖీ, అర్చ‌న‌, చింతామ‌ని, నందిని, అశ్వీని లాంటి ఆడ‌విల‌న్లు అక్కాచెల్లి, అన్నా త‌మ్ముడు, అత్తా మామ అనే బేధం, లేకుండా క్రురాతి క్రూరంగా త‌మ విల‌నిజాన్ని అద్వితీయంగా నటించి ముక్కున వేలేసుకునే విధంగా ఔరా అనిపిస్తున్నారు.

క్లాట్‌-2020 ప్రవేశ పరీక్ష వాయిదా

ఎత్తుకు పై ఎత్తులు నేటీ సీరియ‌ల్ క‌థ‌లో ప‌టుత్వం అంత‌గా గోచ‌రించ‌డం లేదు అనేది బ‌హిరంగ స‌త్యం. ర‌చయిత‌ల‌కు, నిర్మాత‌ల‌కు, ద‌ర్శ‌కుల‌కు, ఛాన‌ల్ అధినేత‌ల‌కు మంచి క‌థ‌లే దొర‌క‌డం లేదా అన్న‌ట్లు ఉంటున్నాయి. మ‌ధ్య త‌ర‌గ‌తి, పేద‌ల జీవితాల‌కు సంబంధించిన క‌థాంశాల‌నే ఎంచుకోవ‌డం లేదు. ధ‌న‌వంతుల‌కు సంబంధించిన‌వే ఎక్కువ‌గా ఉంటున్నాయి. ఒక సీరియ‌ల్‌లో అత్త కోడలను హింసిస్తే , మ‌రో సీరియ‌ల్‌లో భ‌ర్త భార్య‌ను బాధించ‌డం లేదా కోడ‌లు అతను చంపాల‌నుకోవ‌డం, తోటి కొడ‌ళ్ల మ‌ధ్య ఎత్తుకు  పైఎత్తులు  సాగిపోతుంటాయి. స్త్రీల పాత్ర‌ల మ‌ధ్య ప‌గ తీర్చుకోవ‌డ‌మే సీరియ‌ళ్ల ప్రధాన అంశంగా మారింద‌న‌డంలో ఏలాంటి సందేహం లేదు.

మక్కలతో వడలు తయార్‌

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -