end

Twitter Verification : ట్విట్టర్‌ బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ ఇక ప్రీమియం

  • అందరు యూజర్లు బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ పొందవచ్చు
  • ట్విట్టర్‌ అధినేత, సీఈఓ ఎలాన్‌మస్క్‌ వెల్లడి

Twitter Verification : టెస్లా సీఈఓ(Tesla CEO), ట్విట్టర్‌ ఓనర్‌/సీఈఓ(Twitter CEO) ఎలాన్‌మస్క్‌ (Elon Musk) ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత కంపెనీలో భారీ మార్పులు చేస్తున్నారు. ముఖ్యంగా ఎంప్లాయిస్‌ను(Twitter Employees) కూడా మార్చుతున్నారు. ఇప్పుడు కొత్తగా ట్విటర్‌ వెరిఫికేషన్‌(Twitter Blue Tick Verification Program)  కోసం యూజర్లు ప్రతి నెలా 8 డాలర్లు చెల్లించాలనే (Twitter Subscription) నిబంధనలు జారీ చేశారు. దీనికోసం ట్విట్టర్‌ డెవలప్‌మెంట్‌ టీమ్‌కు పలు సూచనలు జారీ చేశారు. అయితే ఇదివరకు ట్విట్టర్‌ వెరిఫికేషన్‌ బ్లూ మార్కు (Blue Mark) అందరు  యూజర్లకు ఇచ్చేవారు కాదు. కేవలం సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, టెక్‌ దిగ్గజాలు, జర్నలిస్టులు, ఆయా రంగాలలో పేరుగాంచిన వారికి మాత్రమే వెరిఫికేషన్‌ చేసి ఫ్రీగానే బ్లూ టిక్‌ మార్కు ఇచ్చేవారు.

అయితే మస్క్‌ కొత్తగా అందరు యూజర్లు వెరిఫికేషన్‌ చేసుకొని బ్లూ టిక్‌ పొందవచ్చని పేర్కొన్నారు. ఇదేగాకుండా బ్లూటిక్‌ మార్కు పొందిన యూజర్లు ప్రియారిటీ యూజర్లుగా మారుతారని, అలాగే వారు స్పామ్‌ మెసేజ్‌ల(Twitter Spam Messages) నుండి తప్పించుకోవచ్చని తెలిపారు. అలాగే ఎక్కువ నిడివి ఉన్న వీడియోలు(Long Videos), ఆడియోలు(Long Audios) కూడా పోస్టు చేసుకోవచ్చు. అలాగే ప్రీమియం యూజర్లకు తక్కువ యాడ్స్‌ (Twitter Ads) కనబడతాయని తెలిపారు. అయితే ఈ ట్విటర్‌ బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ ప్రస్తుతం అన్ని దేశాలలో అందుబాటులో లేదు. కేవలం కొన్ని దేశాలకు పరిమితం అయి ఉంది. ఎలాన్‌మస్క్‌ దీని గురించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

(Rahul Jodo Yatra :మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే..)

Exit mobile version