- అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురగా వస్తూ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం వద్ద సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయాయ్యయి. అయితే ఈ మృతుల్లో ఆర్టీటి ఆసుపత్రి డాక్టర్ శివమాధవి(38) కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.