end

కుటుంబాల మధ్య చిచ్చుపెట్టిన కరోనా వైరస్‌

  • కర్రలతో దాడులు చేసుకున్న రెండు వర్గాలు

కరోనా వైరస్‌ రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. కరోనా వైరస్‌ మీకు సోకిందంటూ ఒక కుటుంబై దుష్రప్రచారం చేశారని మరో కుటుంబం గొడకు దిగింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… నరసింహాపురం గ్రామంలో కొంత మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలింది.

వైసీపీ గూటికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే రమేష్‌బాబు

అయితే కరోనా సోకని కుటుంబ సభ్యులకు కూడా వైరస్‌ వ్యాప్తిచెందిందని తప్పుడు ప్రచారం చేశారంటూ ఇరు వర్గాల కుటుంబ సభ్యులు ఘర్షణకు దిగారు. ఈ గొడవ పెద్దదై కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ దాడిలో రెండు కుటుంబాలకు చెందిన 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. ఇరు కుటుంబ సభ్యులు ఒకరిపైమరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.

కళాశాల, వర్సిటీల పరీక్షలు నిర్వహించాల్సిందే !

ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపడతామని చింతకాని ఎస్‌.ఐ తెలిపారు. ఏదైమైనా కరోనా వైరస్‌ కుటుంబాల మధ్య కూడా చిచ్చులు పెడుతోంది. కోవిడ్‌ సోకిన వారెవరైనా కావచ్చు. వారిని దూరం పెట్టడం, వారిని అంటరానివారిగా చూడడం అమానుషం. ప్రజలలో కరోనా వైరస్‌ పట్ల ఇంకా చాలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Exit mobile version