end

బావిలో పడి బాలికలు మృత్యువాత

ప్రమాదవశాత్తు ఇద్దరు బాలికలు బావిలో పడి మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా మంగళగూడెంలో జరిగింది. ఖమ్మం రూరల్‌ మండలం మంగళగూడెం పరిధిలోని హరిశ్చంద్రుడు తండా రెండు జిల్లాలకు సరిహద్దుగా ఉంది. అయితే ఇద్దరు బాలికలు వ్యవసాయ బావి దగ్గర నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారి బావిలో పడిపోయారు. ఇద్దరు బాలికలు మృతి చెందడంతో తల్లిదండ్రులు రోధిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version