end
=
Sunday, January 19, 2025
ఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీవాట్సాప్ ఛాట్‌బోట్ ద్వారా ఉబర్‌ రైడ్‌
- Advertisment -

వాట్సాప్ ఛాట్‌బోట్ ద్వారా ఉబర్‌ రైడ్‌

- Advertisment -
- Advertisment -

ఉబర్ ద్వారా ప్రజలందరు కావల్సిన చోటు కి తమకి నచ్చిన సమయానికి ఎక్కడ కి కావాలి అంటే అక్కడికి సేఫ్ గా సెక్యూర్ గా వెళ్తున్నారు. ఉబర్ ఎప్పుడు రైడర్ల కి యుజర్స్ కి మరొక కొత్త ఫీచర్ ని అందించబోతున్నారు. లక్నోలో గతేడాది డిసెంబర్‌లో పైలట్‌గా చేపట్టిన ఫీచర్‌ను తాజాగా ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ఏమిటంటే మీరు ఉబర్ కారు కానీ ఆటో కానీ బుక్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్‌లో హిందీ లేదా ఇంగ్లీష్ ఏ భాషలో చెప్పినా మీకు రైడ్ బుక్ అవుతుంది. ఉబర్ కారు బుకింగ్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

ఉబర్ కంపెనీ వాట్సాప్‌ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించింది. ఈ భాగస్వామ్యంలో ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లోని యూజర్లు అధికారిక వాట్సాప్ ఛాట్‌బోట్ ద్వారా ఉబర్‌ రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఈ వాట్సాప్ ఛాట్‌బోట్ అందుబాటులో ఉంటుంది. దీని కోసం వాట్సాప్ టూ రైడ్ ప్రొడక్టు ఫీచర్‌ను మరింత విస్తరిస్తున్నట్టు ఉబర్ ప్రకటించింది. తొలుత ఈ ఫీచర్‌ను డిసెంబర్ 2021లో లక్నోలో పరీక్షించింది. వాట్సాప్ బిజినెస్‌ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసిన ఈ ఫీచర్‌ రెండు భాషల ద్వారా సరికొత్త సెగ్మెంట్ కస్టమర్లను ఉబర్ మొబిలిటీ సర్వీసులు చేరుకునేందుకు ఉపయోగపడుతుంది అని కంపెనీ తెలిపింది.

వాట్సాప్ ద్వారా రైడ్ ఎలా బుక్ చేసుకోవాలి.

వాట్సాప్ నుంచి ఉబర్ బిజినెస్ అకౌంట్ నెంబర్‌కి మెసేజ్ చేయాలి.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి.
ఉబర్ వాట్సాప్ ఛాట్ ఉపయోగించేందుకు నేరుగా లింక్‌ను క్లిక్ చేయాలి.
పికప్, డ్రాప్ లొకేషన్లను ఉబర్ యూజర్లను అడుగుతుంది. ఆ తర్వాత ఎంత ఛార్జ్ అవుతుంది, డ్రైవర్ ఏ సమయం కి మిమ్మల్ని పిక్ చేసుకుంటాడో తెలుపుతుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -