- రెండవ దశకు చేరుకుంటున్న కరోనా వైరస్
- నాలుగు వారాల పాటు ఇంగ్లండ్ లాక్‌డౌన్
- రెండవ దశతో పెనుముప్పు
ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసిన కరోనా వైరస్ ఇప్పుడు రెండవ దశకు చేరుకుటోంది. మొదటి దశలోనే లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న కోవిడ్ వైరస్ మళ్లీ రెండవ దశ రూపంలో విజృంభిస్తోంది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో రెండవ దశ ప్రారంభమైంది. దీంతో ఐరోపా దేశాల్లో ప్రజలు వణికిపోతున్నారు. అయితే మొదటి దశకంటే రెండవ దశ చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐరోపా దేశాల్లో నాలుగు వారాలపాటు లాక్‌డౌన్ విధించాలని లండన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయించారు.
రెండు బైకులు ఢీ; ముగ్గురు మృతి
కఠినమైన చర్యలు, లాక్‌డౌన్ తప్ప ఇప్పట్లో ఈ మహమ్మారిని అడ్డుకునే మెడిసిన్ లేదని బోరిస్ తెలిపారు. అత్యవసరాలు తప్పా మిగతా అన్నింటినీ మూసి ఉంచాలని ఆయన సూచించారు. పబ్బులు, రెస్టారెంట్లు, బార్లు, సినీమా హాళ్లు మూసివేయాలని నిర్ణయించారు. అయితే పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు అనుమతి ఉంటుందన్నారు. ప్రజలు కచ్చితంగా కఠినమైన స్వీనియంత్రణ పాటిస్తే క్రిస్మస్ నాటికి పరిస్థితులు చక్కబడతాయని బోరిస్ వివరించారు.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ, కానిస్టేబుల్
ఇంగ్లండ్‌లో కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని ఆ దేశ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి ఇలాగే జరిగితే మరణాల రేటు ఊహించని విధంగా ఉండవచ్చునని తెలిపారు. ఇదిలావుండగా యు.కె లో ఇప్పటి వరకు 10,11,660 కేసులు నమోదు కాగా 21,915 కేసలు కేవలం ఒక రోజు వ్యవధిలోనే పెరిగాయని తెలిపారు. అయితే కరోనా వైరస్ వల్ల 46,555 మంది మరణించినట్లు వివరించారు.