end
=
Thursday, April 24, 2025
సినీమాపూరీ జీవితాన్ని మార్చిన‌ ర‌మాప్ర‌భ మాట‌ !
- Advertisment -

పూరీ జీవితాన్ని మార్చిన‌ ర‌మాప్ర‌భ మాట‌ !

- Advertisment -
- Advertisment -
  • కృష్ణతో ఫ‌స్ట్ చిత్రం అలా ఆగిపోయి.. `బ‌ద్రి` అయింది..
  • త‌ర్వాత ర‌మాప్ర‌భ మాట‌ల‌ను పూరీ నిజం చేశారు.. స్టోరీ ఇదే..

అది హైద‌రాబాద్ కృష్ణానగర్. ఆర్టిస్ట్ పొట్టి వీరయ్య గారి STD బూత్. ఉన్న‌ట్టుండి ల్యాండ్ నంబ‌ర్‌కు ఒక‌రోజు కాల్ వ‌చ్చింది. `పూరీ జగన్నాథ్(Puri jagannath) అనే అబ్బాయితో మాట్లాడాలి` అని అవ‌త‌లి వాయిస్‌. STD బూత్ ఎదురుగా ఉన్న ఇంటిపైన బ్యాచిలర్స్ రూంలో ఉండే పూరీ ట‌క్కున బూత్ వ‌ద్ద‌కు వ‌చ్చాడు. కొత్త కొత్త యాక్టర్లకు డైరెక్టర్లకు అడ్డా అప్పట్లో ఈ STD బూత్‌. పూరీకి ఆ ఫోన్ చేసింది నిర్మాత ఐబీకే మోహ‌న్‌(Producer IBK Mohan). ఆయ‌న‌కు పూరీ జగన్నాథ్ కథ చెప్పి నాలుగు నెలలైంది. కథ ఓకే అయింది. టైటిల్ రిజిస్టర్ చేయించడం కోసం ఆయన పూరీకి కాల్ చేశాడు.

పూరీ రిసీవ‌ర్ ప‌ట్టుకుని మాట్లాడుతున్నాడు. `టైటిల్ ఏంటి?` అని అవ‌త‌లి నుంచి ప్ర‌శ్న‌. పూరీ ఒక్క క్ష‌ణం ఆగాడు. అప్పుడు `ముత్తు` రిలీజ్ అయి పెద్ద ప్రభంజనం సృష్టిస్తోంది, ఆ చిత్రంలో `థిల్లాన థిల్లాన నా కసి కళ్ళ కూన` పాట వైరల్ అయిపోయింది. మరోమాట లేకుండా మన టైటిల్ “థిల్లాన”(Thillana movie) అనేశాడు పూరీ. అప్ప‌టి కి కృష్ణ(Superstar Krishna) `రౌడీ అన్నయ్య`, `నెంబర్ వన్`, `అమ్మ దొంగా`, `తెలుగు వీర లేవరా` లాంటి సినిమాలతో దూసుకుపోతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ అనాలో కొత్త హీరో వచ్చాడనాలో తెలిదు గానీ.. `సంప్రదాయం` సినిమా హిట్టు.. `యమలీల`లో స్పెషల్ సాంగ్ దుమ్ములేపింది.

`వారసుడు`, `రాముడొచ్చాడు`లో స్పెషల్ క్యారెక్టర్లు కృష్ణ శకం మళ్ళీ మొదలైంది. కృష్ణ గురించి గొప్పగా చెప్పడం అని కాదుగానీ ఆ టైం లో ఏ పెద్ద హీరోకు ఈ కథ చెప్పినా అనుభవం లేని కారణంగా రిజెక్ట్ చేసేవారు. కానీ అసలు ఏమాత్రం అనుభవం లేని కొత్త దర్శకులకు కూడా పిలిచి మరీ అవకాశం ఇచ్చే రికార్డు ఉంది కృష్ణకు. పూరీ చెప్పిన కథ ఆయనకు చాలా బాగా నచ్చింది. పూరీ సంతోషానికి హద్దుల్లేవు. డైరెక్టర్ అవ్వాలన్న తన కల ఇంత తొందరగా నిజం అవుతుందని అనుకోలేదు, అయితే ఆ ఆనందం ఎక్కువరోజులు లేదు…

1996 లో సినిమా క్లాప్ కొట్టి, మూడు రోజుల ఫస్ట్ షెడ్యూల్ తరువాత సినిమా ఆగిపోయింది. అందుకు కారణం అంతకుముందు సంవత్సరంలో ఐబీకే మోహన్ `దొరబాబు` అనే సినిమా తీశాడు. అది ఫ్లాప్ అవ్వడంతో ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ వ‌చ్చాయి. దీంతో సినిమా ఆగిపోయింది. నేచుర‌ల్ స్టార్ నాని `జెర్సీ` సినిమాలో ట్రైన్ సీన్ గుర్తుంది క‌దా.. అలా ఫిలిం నగర్ నుంచి కృష్ణా నగర్ వరకూ ఎక్కడా ఆగకుండా పూరీ నడుచుకుంటూ వచ్చాడు. అక్కడ త‌న లాంటి వాళ్లు ఎంతమంది ఉన్నారో.. అని ఆలోచిస్తూ కూర్చున్నాడు…

అటువైపుగా సినిమా వెహికల్ ఒకటి వచ్చి ఆగింది. `కృష్ణ గారితో సినిమా ఆగిపోతే ఏంటి? నువ్వు కృష్ణ కొడుకుతో ఇండస్ట్రీ హిట్ కొడతావేమో ఎవరికి తెలుసు? బాధపడుతూ కూర్చుంటే పనులవ్వవు ఇక్కడ` అంటూ కారు దిగి వ‌చ్చిన సీనియర్ ఆర్టిస్ట్ రమాప్రభ అని వెళ్లిపోయారు. ఆ `థిల్లాన` కథనే కాస్త మార్పులు చేర్పులు చేసి పూరీ పవన్ కళ్యాణ్ కు చెప్పారు. అదే త‌ర్వాత `బ‌ద్రి` అయింది. క‌ట్ చేస్తే రమాప్రభ చాలా క్యాజువల్ గా అన్న మాటలు నిజం అయ్యాయి. పూరీ మ‌హేశ్‌తో `పోకిరి` సినిమా తీసి బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టారు.

– విశ్వ టాకీస్‌
90309 38479

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -