- రెండేళ్ల క్రితం మరణించిన కొడుకు
- వైధవ్యంలో ఉన్న కోడలిని పెళ్లాడిన మామ
- క్షత్రియ ఆచారం ప్రకారం పెళ్లి
బస్సులో మంటలు … తప్పిన ప్రమాదం
కొడుకు చనిపోయి వైధవ్యంలో ఉన్న కోడలిని మామ పెళ్లి చేసుకున్నాడు. ఈ వింతైన సంఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ర్టంలోని బిలాస్‌పూర్ జిల్లాలో జరిగింది. కృష్ణా రాజ్‌పుత్ సింగ్‌కు కొడుకు గౌతమ్ రాజ్‌పుత్ కు కొన్నాళ్ల క్రితం ఆర్తిసింగ్ అనే యువతితో వివాహం జరిగింది. అయితే దురుదృష్టవశాత్తు గౌతమ్‌సింగ్ రెండు సంవత్సరాల క్రితం మరణించాడు. అయితే భార్య ఆర్తి సింగ్ మాత్రం అత్తగారింట్లోనే ఉంటుంది. కృష్ణా రాజ్‌పుత్ సింగ్ కుటుంబం రాజ్‌పుత్ వంశానికి చెందినది. రాజ్‌పుత్ వంశంలో స్త్రీలు పెద్దగా బయటకు రారు. దీంతో భర్త మరణించినప్పటి నుంచి రెండేండ్లపాటు ఆర్తిసింగ్ ఇంట్లోనే ఉండిపోయింది.
క్షత్రియ ఆచారం ప్రకారం మహిళలకు పునర్ వివాహం చేయవచ్చు. ఇదే విషయాన్ని ఆర్తి సింగ్ మామ కృష్ణా రాజపుత్ సింగ్ క్షత్రియ మహాసభ ముందుకు తీసుకొచ్చారు. దీంతో క్షత్రియ మహాసభ సభ్యులు కృష్ణాసింగ్ ప్రతిపాదనపై ఆయన కోడలు ఆర్తిసింగ్ అభిప్రాయం కోరగా… రెండేండ్లుగా మామ తనను చూసుకుంటున్న తీరు నచ్చిన ఆర్తిసింగ్ కూడా మామను పెండ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. దీంతో క్షత్రియ సంప్రదాయం ప్రకారం కొద్దిమంది సమక్షంలో వారి వివాహం జరిగింది.
మాజీ హోంమంత్రి ‘నాయిని’ ఆరోగ్యం విషమం