end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంనోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగి ఆత్మహత్య
- Advertisment -

నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగి ఆత్మహత్య

- Advertisment -
- Advertisment -

ఉద్యోగం రాలేదని తీవ్రమనస్థాపానికి గురైన యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాధాకర సంఘటన దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన బిర్లా శ్రీకాంత్‌ గత కొన్ని రోజులుగా కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం హైదరాబాదులో కోచింగ్‌ తీసుకున్నాడని బంధువులు తెలిపారు. ఆ తర్వాత సిద్దిపేటలో కూడా పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్ష కోసం కూడా కోచింగ్‌ తీసుకుంటున్నాడు. చాలా రోజులుగా నోటిఫికేషన్లు రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికిగురై శ్రీకాంత్‌ తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు వాపోయారు. శ్రీకాంత్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు వేడుకుంటున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -