కేంద్ర యూనియన్ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23కి గానుపార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్‌ను సాధారణంగా బ్రీఫ్‌కేస్‌లో ప్రింటెడ్ పేపర్లలో కాకుండా ఈ సారి ఆమె డిజిటల్‌ను ప్రోత్సహిస్తూ కాగితం వాడకాన్ని తగ్గిస్తూ ట్యాబ్లెట్‌లో ప్రవేశపెట్టారు. ఆమె గంటన్నరపాటు ట్యాబ్లెట్‌లోని బడ్జెట్ వివరాలను చదివి వినిపించారు. అనంతరం కేంద్ర మంత్రివర్గం బడ్జెట్‌ను ఆమోదించింది.
బడ్జెట్ అంచనాలు..
- జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే అత్యధిక ఆదాయం.
- 2022-23 ఆదాయ వనరులు రూ. 22.84 లక్షల కోట్లు.
- 2025-26 నాటికి ద్రవ్య లోటును 4.5 శాతానికి తగ్గించడం లక్ష్యం.
- 2022-23 మొత్తం బడ్జెట్ అంచనాలు రూ. 39.45 లక్ష కోట్లు.
- 2022 జనవరిలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.43 లక్షల కోట్లు.
- 2022-23 బడ్జెట్‌లో ద్రవ్య లోటు 6.9 శాతం.
డిజిటల్ రూపీ..
- రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్ రూపీ.
- ఆర్‌బీఐ ద్వారాసెట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ.
- డిజిటల్ రూపీ విడుదలతో ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహం.
- కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్ కరెన్సీ రూపకల్పన
రాష్ట్రాలకు ఆర్థికసాయంగా రూ. లక్ష కోట్ల నిధి ఏర్పాటు
- పీఎం గతి శక్తి, ఉత్పాదక మూలధన వ్యయాలకు ఈ రుణాలు ఉపయోగించాలి.
- రాష్ట్రాల రుణ పరిమితలకు అదనంగా ఆర్థిక సాయం.
- దేశ వ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం రూ. 10.68 లక్షల కోట్లు కేటాయింపు.
- మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు కేంద్ర సాయం
- ప్రత్యేక నిధి ద్వారా 50 ఏళ్లకు రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు.
- ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు.
క్రిప్టో కరెన్సీకి గ్రీన్ సిగ్నల్
- డిజిటల్ కరెన్సీల ఆదాయంపై పన్ను మినహాయింపులకు అవకాశం లేదు.
- డిజిటల్ కరెన్సీల ద్వారా ఆదాయం, ఆస్తుల బదిలీపై 30 శాతం పన్ను.
- క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై 30 శాతం పన్ను.
ఐటీ రిటర్న్స్..
- రెండేండ్ల వరకు వ్యక్తిగత ఐటీ రిటర్న్‌లు దాఖలుకు అవకాశం.
- ఐటీ రిటర్న్‌ల దాఖలులో మరో వెసులుబాటు.
- చట్టాల నుంచి కూడా ఎలాంటి మినహాయింపు లేకుండాచర్యలు.
- బయటపెట్టిన ఆదాయం, సోదాల్లో దొరికినప్పుడు కఠినమైన చర్యలు
రాష్ట్ర ప్రభుత్వఉద్యోగులకూ ఎన్‌పీఎస్ డిడక్షన్ పెంపు
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఎన్‌పీఎస్ డిడక్షన్ 10 నుంచి 14 శాతానికి పెంపు.
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్ డిడక్షన్
పట్ణ ప్రణాళిక కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
- సులభతర వాణిజ్య ప్రోత్సాహం రెండో దశ ప్రారంభం.
- త్వరలో భవనాల ఆధునిక బై లాస్ విడుదల.
- 5 విద్యాసంస్థలకు పట్టణ ప్రణాళిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ హోదా.
- పట్ణ ప్రణాళిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలకు రూ. 250 కోట్లు.
డిజిటల్ విశ్వవిద్యాలయాలు.. ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్..
- ఒకటి నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేక ఛానళ్లు ప్రారంభం.
- డిజిటల్ విద్య అందించే ఉపాధ్యాయులకు అందుబాటులోకి ప్రపంచస్థాయి ఉపకరణాలు.
- ప్రధానమంత్రి ఈ-విద్యలో భాగంగా ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్.
- విద్యారంగంలో తొలిసారిగా డిజిటల్ విశ్వవిద్యాలయాలు
- ప్రధాని ఈ – విద్య కార్యక్రమం కింద టెలివిజన్ ఛానళ్లు 12 నుంచి 200కు పెంపు.
- విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ సంస్థల మధ్య బలమైన అనుసంధానం.
- విద్యార్థులందరికీ అందుబాటులోకి ఈ – కంటెంట్.
- మానసిక సమస్యల చికిత్స కోసం ఆన్‌లైన్ టెలీమెడిసిన్ విధానానికి రూపకల్పన.
- డ్రోన్ శక్తి కార్యక్రమంలో భాగంగా అంకుర సంస్థలకు ప్రోత్సాహం.
- ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ
- బెంగళూరు ట్రిపుల్ ఐటీ సాంకేతిక సాయం అందిస్తుంది.
80 లక్షల గృహాలు
- రూ. 44 వేల కోట్లతో అందుబాటు ధరల్లో గృహాల నిర్మాణం.
- పీఎం ఆవాస్ యోజనలో భాగంగా 80 లక్షల గృహాలు.
- 112 ఏస్పిరేషన్ జిల్లాల్లో 95 శాతం వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి.
- ఉత్తర సరిహద్దుల్లో గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం.
సౌర విద్యుత్ తయారీకి ప్రోత్సాహకం..
- ప్రైవేటు రంగంలో అడవుల ఉత్పత్తి కోసం నూతన పథకం.
- దేశీయంగా సౌర విద్యుత్ ప్లేట్ల తయారీ ప్రోత్సాహకానికి రూ. 19,500 కోట్లు కేటాయింపు.
- బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్పత్తి కోసం 4 పైలట్ ప్రాజెక్టులు.
రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశం
- రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించి స్వయం సమృద్ధి సాధించేలా కృషి.
- డీఆర్‌డీవో, ఇతర రక్షణ పరిశోధనా సంస్థల భాగస్వామ్యంతో ప్రవేటు సంస్థలకు అవకాశం.
అందుబాటులోకి 5జీ సాంకేతికత.. చిప్ ఆధారిత పాస్‌పోర్టులు జారీ..
- 2022-23లో ఈ-పాస్‌పోర్టుల జారీకి కొత్త సాంకేతికత.
- 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు.
- 2022-23లో ప్రైవేటు సంస్థల ద్వారా 5 జీ సాంకేతికతను ప్రవేశం.
- దేశ వ్యాప్తంగా ఈ ఏడాది అందుబాటులోకి 5 జీ సాంకేతికత.
- ఇక నుంచి చిప్ ఆధారిత పాస్‌పోర్టులు జారీ.
రిజిస్ర్టేషన్లకు ఆధునిక వ్యవస్థ
- దేశంలో ఎక్కడ నుంచైనా రిజిస్ట్రేషన్‌కు నూతన వ్యవస్థ
- దేశ వ్యాప్తంగా డీడ్‌లు, రిజిస్ట్రేషన్లకు ఆధునిక వ్యవస్థ
- దేశ వ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్ పథకం(ఎన్‌జీడీఆర్ఎస్)
యాంత్రీకరణకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం
- వరి, గోధుమ కొనుగోళ్లు, మద్దతు ధరల కోసం రూ. 2.37 లక్షల కోట్లు
- వ్యవసాయ వర్సిటీల్లో సిలబస్‌లో మార్పులు.
- పంటల పరిశీలన, భూమి రికార్డులు, పురుగుల మందు పిచికారికి కిసాన్ డ్రోన్లు.
- జీరో బడ్జెట్ ఫార్మింగ్, సేంద్రీయ సాగుకు ప్రోత్సాహకాలు
- ఎంఎస్ఎంఈల రేటింగ్‌కు రూ. 6 వేల కోట్లతో ప్రత్యేక పథకం.
- సాగురంగంలో యాంత్రీకరణకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం.
- గంగా పరివాహం వెంబడి నేచురల్ ఫార్మింగ్ కారిడార్.
ఆన్‌లైన్‌లో కాంట్రాక్టర్ల బిల్లులు..
- బిల్లుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకునే సౌకర్యం.
- కాంట్రాక్టర్లకు ఈ-బిల్లులు పెట్టుకునే అవకాశం.
- మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి, వినియోగంపై దృష్టి.
- ఎగుమతుల వృద్ధికి పారిశ్రామిక సంస్థలకు నూతన ప్రోత్సాహకాలు.
వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి
- మహిళలు, చిన్నారుల అభివృద్ధికి 3 ప్రత్యేక పథకాలు.
- గత రెండేళ్లలో నల్ సే జల్ కింద 5.7 కోట్ల కుటుంబాలకు అందుబాటులోకి తాగునీరు.
- మహిళా, శిశు సంక్షేమం కోసం మిషన్ శక్తి, వాత్సల్య సక్షం అంగన్‌వాడీల రూపకల్పన
- దేశ వ్యాప్తంగా జిల్లాల వారీ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకం.
తృణ ధాన్యాల సంవత్సరంగా 2023..
- 2023ను తృణ ధ్యానాల సంవత్సరంగా ప్రకటన
- నదుల అనుసంధానానికి 5 డీపీఆర్‌లు సిద్ధం చేశాం.
- వంట నూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి
- సేంద్రీయ ప్రకృతి వ్యవసాయానికి ప్రత్యేక ప్రోత్సాహం.
- రసాయన రహిత వ్యవసాయ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం.
- చిరు ధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం ఇస్తాం.
- పీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం.
డిజిటల్ బ్యాంకింగ్‌కు మరింత ప్రోత్సాహం..
- 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఏటీఏం సేవలు.
- డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్‌కు ఈ ఏడాది కూడా మరింత ప్రోత్సాహం.
- మినిమం, మ్యాగ్జిమం గవర్నమెంట్ లక్ష్యంలో భాగంగా కాలం తీరిన చట్టాలు రద్దు.
క్రెడిట్ గ్యారంటీ పథకం..
- క్రెడిట్ గ్యారంటీ పథకానికి రూ. 2 లక్షల కోట్ల ఆర్థిక నిధులు.
- చిన్న, మధ్య తరహా పరిశ్రమలల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ పథకం.
- పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం అదనపు నిధులు, ప్రత్యేక వ్యవస్థలు
- ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు.
- ఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు అవకాశాలు.
వచ్చే 25 ఏండ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది..
- పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్‌తో ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం.
- డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థిక సాయం లభిస్తుంది.
- వచ్చే ఐదేండ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు.
- యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీలకు ఈ బడ్జెట్ ఊతమిస్తుంది.
- గృహ, వసతులు, తాగునీటి కల్పనలో దేశం వేగంగా ముందుకెళ్తోంది.
- కొవిడ్ కట్టడిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా కలిసొచ్చింది.
- నీలాంచల్ నిస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ను ప్రవేట్‌పరం చేశాం.
- అందరి ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన.
- పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్ నాంది.
- ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకా కీలకపాత్ర పోషించింది.
- ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాలు 14 రంగాల్లో మంచి అభివృద్ధి కనబడింది.
- త్వరలో ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ రాబోతుంది.
ఎంఎస్ఎంఈల కోసం నూతన పోర్టల్
- ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం.
- ఎంఎస్ఎంఈలకు మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్
- రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయం పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక కథనం.
- దేశంలో నాలుగు చోట్ల మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తాం.
- వ్యవసాయ ఉత్పత్తుల విలువల పెంపు కోసం స్టార్టప్‌లకు ఆర్థిక సాయం.
టూరిజం అభివృద్ధే లక్ష్యం..
- 400 వందే భారత్ రైళ్లు ప్రారంభిస్తాం.
- పర్వతమాల ప్రాజెక్టులో 8 రోప్‌వేల అభివృద్ధి.
- పీఎం గతిశక్తిలో భాగంగా 2022-23లో ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం.
- కొండ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి తగినంత అవకాశాలు.
- రూ. 20 వేల కోట్లతో 20 వేల కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం.
- 60 కిలోమీటర్ల దూరంతో ఒక్కో రోప్‌వే నిర్మాణం.
- పర్వతమాల ప్రాజెక్టు కింద పర్యావరణ హితమైన అభివృద్ధి.