end

యూనివర్సిటీల్లో విద్యా సంవత్సరం ప్రారంభం

దేశంలోని విశ్వవిద్యాలయాలలో నవంబర్‌ 1 నుండి 2020-21 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించున్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) ప్రకటించింది. డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం కోర్సులను ప్రారంభించాలని, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా విశ్వవిద్యాలయాలకు పంపించింది. ఈ మేరకు నూతన విద్యా సంవత్సరంకు సంబంధించిన క్యాలెండర్‌ను కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్‌పోక్రియాల్‌ విడుదల చేశారు.

దిక్కుమాలిన ‘బిగ్‌బాస్‌’

అయితే అక్టోబర్‌ 31 వరకు డిగ్రీ, పీజీ మొదటి సంవత్సరం ప్రవేశాలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఇంకా ఏమైనా సీట్లు ఖాళీగా ఉంటే నవంబర్‌ 30 వరకు చివరి అవకాశంగా పరిగణించాలని సూచించారు. ఇదేగాకుండా యూనివర్సిటీల్లో ప్రవేశ పరీక్షలు ఆలస్యమైతే నవంబర్‌ 18 నుండి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని, అందుకు సంబంధించి ప్రణాళికలు తయారు చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.

గృహప్రవేశంలో పాలు ఎందుకు పొంగిస్తారు?

అయితే ప్రవేశాల అనంతరం ఏదైనా కారణంచేత విద్యార్థులు సీట్లు రద్దు చేసుకోవడం లేదా, మరే ఇతర కారణాల వల్ల సీట్లు కోల్పవడం జరిగితే విద్యార్థులకు ఫీజు మొత్తం వాపు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అయితే కేవలం నవంబర్‌ 30 వరకు అవకాశం ఉందని తెలిపారు. ఇక డిసెంబర్‌ 31లోపు అడ్మిషన్‌ రద్దు చేసుకున్నట్లయితే ప్రాసెసింగ్‌ ఫీజు కింద రూ.1000 వసూలు చేస్తామని విద్యా సంవత్సరం క్యాలెండర్‌లో తెలిపారు.

15 రోజుల్లోగా ఆన్ లైన్లో నమోదు చేయాలి

2020-2021 విద్యా సంవత్సరం క్యాలెండర్‌

  • 31 అక్టోబర్‌ 2020 – అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి
  • 1 నవంబర్‌ 2020 నుండి డిగ్రీ, పీజీ తరగతులు ప్రారంభం
  • 2021 మార్చి 1 – 7 వరకు సన్నాహక సెలవులు (ప్రిపరేటరీ బ్రేక్‌)
  • 2021 మార్చి 8 – 26 వరకు పరీక్షల నిర్వహణ
  • 2021 మార్చి 27 నుండి ఏప్రిల్‌ 4 వరకు సెమిస్టర్‌ సెలవులు
  • 2021 ఏప్రిల్‌ 5 నుండి సెకండ్‌ సెమిస్టర్‌ తరగతులు ప్రారంభం
  • 2021 ఆగస్టు 1 నుండి 8 వరకు ప్రిపరేషన్‌ సెలవులు
  • 2021 ఆగస్టు 9 నుండి ఆగస్టు 21 వరకు సెకండ్‌ సెమ్‌ పరీక్షల నిర్వహణ
  • 2021 ఆగస్టు 22 నుండి 29 వరకు సెమిస్టర్‌ సెలవులు

డీఎస్సీ 2018 నియామకాలు!

Exit mobile version