- కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ
ఉత్తరప్రదేశ్‌లో రోజు రోజుకు అత్యాచారాలు, హత్యలు ఎక్కువవుతున్నాయని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నేరాలను అదుపు చేయపోతుందని నేషనల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తీవ్రంగా విమర్శించారు. యూపీలో మహిళలకు భద్రత లేదని, హత్రాస్‌కు చెందిన దళిత యువతి నాలుక కోసి మరీ అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
హత్రాస్‌లోఅగ్రకులాలకు చెందిన యువకులు దళిత యువతిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారని విచారం వ్యక్తం చేశారు. బాధిత యువతి రెండు వారాలుగా మృత్యువుతో పోరాడి చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యూపీలో క్రైం చాలా పెరిగిపోయిందని ఆదిత్యనాథ్ ప్రభుత్వం వేడుక చూస్తోందని, మహిళలకు అసలు భద్రత లేదని ప్రియాంక మండిపడ్డారు. గత కొన్ని నెలలుగా వరుసగా ఎన్నో నేరాలు, అత్యాచారాలు జరగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు.