end
=
Saturday, January 18, 2025
సినీమాఉపాసన బర్త్ డే వేడుకలు..
- Advertisment -

ఉపాసన బర్త్ డే వేడుకలు..

- Advertisment -
- Advertisment -

ఉపాసన 1989లో జూలై 20న జన్మించారు. ఉపాసన తండ్రి అనిల్ కామినేని, తల్లి శోభనా కామినేని. రామ్ చరణ్ సతీమణి. అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలు ఉపాసన కొణిదల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ ఫ్యామిలీ పిక్ పోస్ట్ చేశారు రామ్ చరణ్. తండ్రికి తగ్గ కూతురే కాదు, మెగా కోడలిగా కూడా ఉపాసన మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కొణిదల కోడలు కామినేని ఇంటి ఆడపడుచు ఉపాసన పుట్టినరోజు ఈ రోజు (జూలై 20). తన 33వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంగా ఘనంగా జరుపుకుంటున్నారామె. దీంతో సోషల్ మీడియాలో మెగా కోడలికి పుట్టిన రోజు శుభాకాంక్షల్ని తెలుపుతున్నారు మెగా ఫ్యాన్స్. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్‌ పరంగా ఓ పెద్ద సంస్థలో టాప్‌ పొజిషియన్‌లో ఉంటూనే మరోవైపు ఇల్లాలిగా మెగా ఫ్యామిలీలో ఒదిగిపోతుంది ఉపాసన.

ఈ సందర్భంగా ఫ్యామిలీ ఫోటోని పంచుకుంటూ బర్త్ డే విషెస్‌ తెలిపారు రామ్‌చరణ్‌. ఇక చరణ్‌ పంచుకున్న ఫ్యామిలీ ఫోటో ఎంతో అందంగా ఉండటం విశేషం. చిరంజీవి, సురేఖ, చరణ్‌, ఉపాసన పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరోవైపు చిరంజీవి సైతం కోడలు ఉపాసనకి బర్త్ డే విషెస్‌ తెలిపారు. మా ఇంటి కోడలు పిల్ల ఉపాసనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు రామ్‌చరణ్‌ కెరీర్‌ పరంగా చాలా బిజీగా ఉన్నారు. శంకర్‌ దర్శకత్వంలో ఆయన చిత్రంలో నటిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తుంది. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీన్ని వచ్చే సమ్మర్‌లో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు గౌతమ్‌ తిన్ననూరితో ఓ సినిమా చేయనున్నారు చరణ్‌. అలాగే లోకేష్‌ కనగరాజ్‌తోనూ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -