end

UPSC కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఉద్యోగాలు

UPSC Jobs
UPSC Jobs

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC)2022 సంవత్సరానికి గాను కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 687 ఉద్యోగాలకుగాను ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష, పర్సనాలిటీ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

పోస్టుల వివరాలు

మొత్తం పోస్టుల సంఖ్యం : 687
కేటగిరి-1 : జీడీఎంఓ సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌ – 314
కేటగిరి-2 : అసిస్టెంట్‌ డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌(రైల్వే)–300, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌(న్యూఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌)–03, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌2 (ఈస్ట్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్, నార్త్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్, సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌)–70.

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్‌ చేసి ఉండాలి. చివరి ఏడాది ఎంబీబీఎస్‌ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు పరిమితి: 01.08.2022 నాటికి 32 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక : రాతపరీక్ష/పర్సనాలిటీ టెస్ట్‌

దరఖాస్తు : ఆన్‌లైన్‌

చివరితేది: 26.04.2022

పరీక్ష తేది: 17.07.2022

పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.

వెబ్‌సైట్‌: https://upsconline.nic.in

Exit mobile version