end
=
Wednesday, April 2, 2025
వార్తలురాష్ట్రీయంకొనసాగుతున్న వ్యాక్సినేషన్‌
- Advertisment -

కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: ఇవాళ దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10.30 గంటలకు వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని దేశ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. తెలంగాణ విషయానికొస్తే.. వ్యాక్సినేషన్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 140 సెంటర్లు ఏర్పాటు చేశారు. కరోనా టీకా తీసుకున్నవారికి ఎన్నికల్లో వినియోగించే సిరాను ఎడమచేతి బొటనవేలుపై వేయనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాస్‌ రావు వెల్లడించారు. కాగా, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గాంధీ ఆస్పత్రిలో.. ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్‌ తిలక్‌ నగర్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట హెల్త్‌ డిపార్టుమెంట్‌, శానిటేషన్‌ వర్కర్స్‌కు వ్యాక్సిన్‌ ఇస్తున్నట్లు సమాచారం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -