end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌: ప్రధాని
- Advertisment -

ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌: ప్రధాని

- Advertisment -
- Advertisment -

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే.. దేశంలోని ప్రతి పౌరుడికి వ్యాక్సిన్‌ను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఏ ఒక్క వ్యక్తినీ విడిచిపెట్టకుండా, అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించారు. ప్రధాని మోది ఓ జాతీయ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పై వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే బిహార్ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు

ఈ హామీపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటనకు ప్రాధాన్యం లభించింది. ‘‘వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే… ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తాం. ఎవర్నీ మరిచిపోం అని హామీ ఇస్తున్నా.’’ అని ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. అయితే మొదట్లో మాత్రం కోవిడ్ వారియర్స్‌ పైనే సహజంగా దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. పంపిణీ విషయంలో జాతీయ నిపుణుల బృందం ఏర్పాటైందనీ, వారు ఓ ప్రక్రియను నిర్దేశిస్తారని పీఎం తెలిపారు.

ధరణి పోర్టల్ షురూ..

కరోనా వ్యాక్సిన్ ను నిల్వచేయడానికి దేశవ్యాప్తంగా 28,000 కోల్డ్ చైన్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామని, దేశంలోని చివరి మూలల్లో ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా, మండల స్థాయిల్లో అంకిత భావంతో ఉన్న కార్యకర్తల బృందం ఉందని, పారదర్శకంగా, జవాబుదారీతనంతో వారు ఆ పనిని నిర్వర్తిస్తారని అన్నారు.

బ్యాంకు దొంగల అరెస్ట్‌..

వ్యాక్సిన్ పంపిణీ విషయంలో నిపుణుల బృందం అధికారులకు తగిన సూచనలు ఇస్తుందని, ప్రతి వ్యక్తికీ అందేలా వ్యూహం రచించడంలో అధికారులకు ఈ బృందం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ప్రధాని మోది స్పష్టం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -