end
=
Sunday, January 19, 2025
సినీమాదీపావళికి పలకరించనున్న 'వకీల్‌సాబ్'
- Advertisment -

దీపావళికి పలకరించనున్న ‘వకీల్‌సాబ్’

- Advertisment -
- Advertisment -

దీపావళి పర్వదినాన వకీల్‌సాబ్‌(పవన్‌ కళ్యాణ్‌) ప్రేక్షకులను పలకరిచనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. కరోనా కాలంలో లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలల పాటు షూటింగ్ గ్యాప్‌ వచ్చినా.. లాక్‌డౌన్‌ అనంతరం ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్ జరుపుకుంటోంది. కథానాయకుడు కళ్యాణ్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు మూవీ మేకర్స్‌. కాగా, ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ను పవర్‌స్టార్‌ జన్మదినాన విడుదల చేసిన మూవీ టీమ్‌.. దీపావళికి ‘టీజర్’ రిలీజ్‌ చేసే యోచనలో ఉంది. అదే నిజమైతే పవర్‌స్టార్‌ అభిమానులకు బంపరాఫర్‌ వచ్చినట్లే. ఓ వైపు దీపావళి, మరోవైపు వకీల్‌సాబ్‌ టీజర్‌. సూపర్‌ న్యూస్‌ కదా.

ఈ సినిమా బాలీవుడ్‌లో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన ‘పింక్‌’ మూవీకి రీమేక్‌గా రాబోతోంది. అమితాబ్‌, తాప్సీ తదితర తారాగణంతో తెరకెక్కిన పింక్ బాక్సాఫీస్‌ వద్ద బంపర్‌ హిట్‌ కొట్టింది. ఇదే సినిమా తమిళ్‌లోనూ రిలీజ్‌ అయింది. అజిత్‌ హీరోగా నటించిన ఈ మూవీ కూడా మంచి సక్సెస్‌ అందుకుంది. పవన్‌కళ్యాణ్‌తో ఎప్పటినుంచో సినిమా చేయాలని ఎదురుచూస్తున్న దిల్‌ రాజుకు ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరినట్లయింది. శ్రీరాం వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని బోనీకపూర్‌తో కలిసి దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంజలి, నివేదా థామస్‌, అనన్య నగళ్ల, ప్రకాశ్‌ రాజ్‌ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా, వకీల్‌సాబ్‌ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు సంవత్సరాల అనంతరం పవర్‌స్టార్‌ మూవీ రానుండడంతో ఆయన ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -