- ఆదివారం ఉదయం ప్రారభించనున్న ప్రధాని మోడీ
దేశంలో సెమీ బుల్లెట్ రైలు (Semi bullet train)గా గుర్తింపు పొందిన వందేభారత్ రైలు (Vande bharat) ఎట్టకేలకు రెండు తెలుగు రాష్ట్రాల (Telugu state) మధ్య పరుగులు పెట్టడానికి సిద్ధం అయింది. దేశానికే తలమానికంగా భావిస్తున్న వందేభారత్ తెలంగాణ, ఏపీలను (Telangana, AP) కలుపుతూ పరుగులు తియ్యబోతోంది. సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే వందేభారత్ (Vande Bharat from Secunderabad to Visakha)ఎక్స్‌ప్రెస్ పండుగ కానుకగా ఈ నెల 15 ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకాబోతోంది. ఔట్ సైడ్ నుంచి అదిరిపోయే లుక్, ఇన్‌సైడ్‌లో ఓ రేంజ్‌లో ఉండే ఫెసిలిటీస్ (Facilities)తో ఇప్పటికే అందరిని ఆకట్టుకుంటోంది వందే భారత్ ఎక్స్‌ప్రెస్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపు దిద్దుకోవడం దీని ప్రత్యేకత.
వందే భారత్‌ని సెమీ బుల్లెట్ ట్రైన్‌గా చెప్పుకోవచ్చు. దీని లోపలకు అడుగు పెడితే ఎన్నో స్పెషాలిటీస్ పలకరిస్తాయి. ప్రస్తుతం దీని గరిష్ట వేగ పరిమితి గంటకు 160 కి.మీ. మాత్రమే. ఈ గరిష్ట వేగాన్ని 140 సెకన్లలో అందుకుంటుంది. ఫుల్లీ సస్పెండెడ్ ట్రాక్షన్ మోటార్(Fully suspended traction motor)తో తయారుచేసిన సరికొత్త బోగీలను ఈ ట్రైన్‌లో వినియోగించారు. ట్రైన్ ఎంత వేగంతో కుదుపులు అన్న మాటే ఉండదు. ఈ రైలుకు ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి. వాటి నియంత్రణ లోకో పైలట్ వద్ద ఉంటుంది. మధ్యలో పాసింజర్స్ వాటిని తెరవలేరు, క్లోజ్ చేయలేరు. ట్రైన్ ఆగిన కొన్ని క్షణాలకు డోర్లు తెరుచుకుంటాయి. బయలుదేరడానికి కొన్ని సెకన్ల ముందు మూసుకుంటాయి.
ఇప్పటికే ఏడు రైళ్లు పట్టాలెక్కగా, సికింద్రాబాద్ నుంచి విజయవాడ (Secunderabad to Vijayawada) మీదుగా విశాఖకు ఎనిమిదో రైలు పరుగు ప్రారంభించనుంది. తెలుపు వర్ణం, దానిపై నీలి రంగు చారలు, బుల్లెట్ ట్రైన్ తరహాలో లోకో ముందు రూపు, వెడల్పాటి నలుపు రంగు కిటికీ వరస.. ఇలా చూడగానే ఆకట్టుకునే రూపంతో ఉన్న ఈ రైలు సికింద్రాబాద్–విశాఖను కలిపే కొత్త వారధిగా రూపు దిద్దుకుంటోంది. ప్రధాని మోదీ పండుగ రోజున వర్చువల్‌గా ప్రారంభించనున్న నేపథ్యంలో దీని ప్రత్యేకతలేంటో చూద్దాం.
ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు సేవలందిస్తుంది. వైజాగ్ స్టేషన్ నుంచి ఈ ట్రైన్ (20833) ప్రతి రోజూ 5.55 గంటలకు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ రీచ్ అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ రైలు (20834) ప్రతి రోజూ మధ్యాహ్నం 3 గంటలకు స్టార్టయ్యే ఈ ట్రైన్ .. రాత్రి 11.30 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. వందే భారత్ ట్రైన్ రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో 14 ఏసీ ఛైర్ కార్లు, 2 ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు ఉంటాయి. మొత్తం 1128 మంది పాసింజర్స్ ట్రవెల్ చెయ్యొచ్చు.
ఛార్జీల వివరాలు;
చెయిర్ కార్ ఛార్జీలు (ఒక పాసింజర్‌కు)..
• బేస్ ఫేర్: రూ.1,206
• సూపర్ ఫాస్ట్ ఛార్జీలు: రూ.45
• జీఎస్టీ: రూ.65
• రిజర్వేషన్ ఛార్జీలు: రూ.40
• కేటరింగ్ ఛార్జీలు: రూ.364
• మొత్తం: 1,720
ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛార్జీలు (ఒక పాసింజర్‌కు)…
• బేస్ ఫేర్: రూ.1,206
• సూపర్ ఫాస్ట్ ఛార్జీలు: రూ.75
• జీఎస్టీ: రూ.131
• రిజర్వేషన్ ఛార్జీలు: రూ.60
• కేటరింగ్ ఛార్జీలు: రూ.419
• మొత్తం: 3,170
టైమింగ్స్;
వైజాగ్ టూ సికింద్రాబాద్ ( 20833)
విశాఖ – ఉదయం 5 గంటల 55 నిమిషాలకు ప్రారంభం
రాజమండ్రి – 7 గంటల 55 నిమిషాలు
విజయవాడ – 10 గంటలకు
ఖమ్మం – 11 గంటలకు
వరంగల్ – మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు
సికింద్రాబాద్ – మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు
సికింద్రాబాద్ టూ వైజాగ్ ( 20834)
సికింద్రాబాద్ – మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం
వరంగల్ – మధ్యాహ్నం 4 గంటల 35 నిమిషాలు
ఖమ్మం – మధ్యాహ్నం 5 గంటల 45 నిమిషాలకు
విజయవాడ – విజయవాడు సాయంత్రం 7 గంటలకు
రాజమండ్రి – రాత్రి 8 గంటల 50 నిమిషాలకు
విశాఖ – రాత్రి 11 గంటల 30 నిమిషాలకు
ఆదివారం ఉదయం 10.30గంటలకు వర్చువల్‌గా ప్రధాని మోదీ (Narendra modi) పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారని పీఎంవో (PMO) తెలిపింది. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా వివరాలు వెల్లడించింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో ఏర్పాటు చేసే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, జి.కిషన్‌రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, తొలి రోజు ప్రయాణంలో భాగంగా ఈ రైలు 21 స్టేషన్లలో ఆగనుంది. చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ జంక్షన్, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ (Charlapalli, Bhuvanagiri, Janagama, Kazipet, Warangal, Mahbubabad, Dornakal, Khammam, Madhira, Kondapalli, Vijayawada Junction, Nujiveedu, Eluru, Tadepalligudem, Nidadavolu, Rajahmundry, Dwarapudi, Samarlakota, Tuni, Anacapalli, Duvvada) స్టేషన్లలో ఆగుతూ విశాఖపట్నం చేరుకోనుంది. ఆ తర్వాతి రోజు నుంచి ఎంపిక చేసిన నాలుగు స్టేషన్ల(వరంగల్, విజయవాడ, ఖమ్మం, రాజమండ్రి)లో మాత్రమే హాల్ట్ ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. 14 ఏసీ చైర్ కార్ కోచ్‌లు, మరో రెండు ఎగ్జిక్యూటివ్ కార్ కోచ్‌లు కలిపి మొత్తం 16 కోచ్‌లతో కూడిన ఈ రైలులో 1,128 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి.
(Sankranthi:సంక్రాంతి పండుగకు వేటిని దానం చేయాలి)