end

వరదలో చిక్కుకున్న మహిళ

  • రక్షించిన వైమానిక దళం
  • కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు

మధ్యప్రదేశ్ రాష్ర్టంలో కొద్ది రోజుల నుంచి వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ర్టంలోని వరదలు, వాగులు వంకలు, చెరువులు, నదులు పొంగిపోర్లుతున్నాయి. సెహోర్‌లోని సోమల్వాడలో వరద ప్రవహిస్తోంది. వరద ప్రవాహంలో ఓ మహిళ చిక్కుకున్నదని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులను వెంటనే సైనిక బలగాలను రప్పించారు. హెలిక్యాప్టర్ సహయంతో వరదలో చిక్కుకున్న మహిళను వైమానికి దళం రక్షించింది. వరదలో చిక్కి మృత్యువు ఒడికి చేరబోతున్న నన్ను రక్షించినందుకు మీకు ధన్యవాదలు అంటూ సైనిక బలగాలకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

Also Read…

Exit mobile version