end
=
Saturday, November 23, 2024
వార్తలురాష్ట్రీయంఅమ్మను గౌరవించిన 'వాసవిక్లబ్‌'
- Advertisment -

అమ్మను గౌరవించిన ‘వాసవిక్లబ్‌’

- Advertisment -
- Advertisment -

సంగారెడ్డి: బహిరంగ ప్రదేశాల్లో పసి పిల్లలకు పాలిచ్చే తల్లుల బాధ వర్ణనాతీతం. చిన్న పిల్లలకు పాలిచ్చే తల్లుల కోసం బస్టాండ్ లో ప్రత్యేక గదులను ఏర్పాటుకు వాసవి క్లబ్ ముందుకొచ్చింది. సంగారెడ్డి పట్టణం పాత బస్టాండ్ లో వాసవి క్లబ్ యూత్ అధ్యక్షుడు చేరాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో ‘అమ్మకు గౌరవం’ అనే కార్యక్రమంలో భాగంగా చిన్న పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేక గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ యూత్ అధ్యక్షుడు ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ.. ఎక్కడలేని విధంగా పాలిచ్చే తల్లుల కోసం చిన్నారుల పట్ల జాగ్రత్తగా ఉండేందుకు ఈ ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినందుకు పంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణం, శ్రీధర్, ప్రదీప్, రాధాకృష్ణ, విజయభాస్కర్, శ్రీనివాస్, నరేంద్ర, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -