end
=
Thursday, April 3, 2025
సినీమాభయంకరమైన లుక్‌లో వెంకీ..
- Advertisment -

భయంకరమైన లుక్‌లో వెంకీ..

- Advertisment -
- Advertisment -

సీసీ కెమెరాల ఏర్పాట్లలో హైదరాబాద్‌ తొలిస్థానం

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌తో ఎక్కడి షూటింగ్స్‌ అక్కడ ఆగిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 6 నెలల పాటు సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కాస్త పరిస్థితులు మెరుగుపడటంతో.. ప్రభుత్వాలు కూడా ఆన్‌ లాక్‌ ప్రకటిస్తూ.. నిబంధనలతో కూడిన అనుమతులను ఇస్తున్నాయి. అందులో సినిమా షూటింగ్స్‌కి కూడా అనుమతి లభించడంతో.. సెలబ్రిటీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్‌ స్టార్ట్ చేశారు. అయితే ముందు చిన్న చిన్న హీరోలే షూటింగ్స్‌ మొదలుపెట్టినా.. ఇప్పుడిప్పుడే పెద్ద హీరోలలో కూడా కదలిక వస్తోంది.

విరాట్‌ నువ్వు సిక్సర్లు బాదాల్సిందే: యూవీ

తాజాగా విక్టరీ వెంకటేష్‌ నటిస్తోన్న ‘నారప్ప’ చిత్ర షూటింగ్‌ కూడా పునఃప్రారంభమైనట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా తెలియజేసింది. సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ వెంకటేష్, ప్రియమణి హీరోహీరోయిన్లుగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ నిర్మాతలు సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రం లాక్ డౌన్‌కి ముందే శరవేగంగా 60 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర యూనిట్ రీసెంట్‌గా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హైద‌రాబాద్ ప‌రిస‌ర‌ ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంటోంది.

‘డబుల్‌’ ఇళ్లకు నిధులు మంజూరు

ఈ సందర్భంగా నిర్మాత‌ సురేష్ బాబు మాట్లాడుతూ.. అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో ‘నారప్ప’ షూటింగ్ ప్రారంభించి తమిళ నాడులోని కురుమలై మ‌రియు తిరిచందూర్ సమీపంలో ఉన్న తెరికాడు రెడ్ డెసర్ట్ లో కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేశాం. క‌రోనా వ్యాప్తి కార‌ణంగా నిలిపివేసిన షూటింగ్‌ని త‌గిన జాగ్రత్తలు తీసుకుంటూ రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో తిరిగి ప్రారంభించాం. ప్రియమణి, రావు రమేష్, రాజీవ్ కనకాల త‌దిత‌ర‌ ప్రధాన తారాగణమంతా పాల్గొనగా కీలకమైన సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నాం.

వికారాబాద్‌లో ప్రేమికులు ఆత్మహత్య

ఈ షెడ్యూల్‌తో 80 శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. మిగిలిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను పూర్తిచేసి, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌స్తామని నిర్మాత సురేష్‌ బాబు, కలైపులి థాను వెల్లడించారు. కాగా, ఈ సినిమాలో వెంకీ డిఫెరెంట్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఫ్యామిలీ హీరోగా, ప్రేమికుడిగా కనిపించే వెంకీ బాబు.. ఊరమాస్ లుక్‌ లో దర్శనమివ్వనున్నారు.

దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -