end

Rowdy Hero:హిందీ భాషను ఎగతాళి చేసిన విజయ్ దేవరకొండ.. 

రౌడీ హీరో విజయ్ దేవరొకొండ (Vijay Devarakonda)‘లైగర్’ (liger) సినిమాతో పాన్ ఇండియా (pan india) లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (puri jagannath)తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya pande) నటించింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ సినిమాతో ఉత్తరాదిలో విజయ్ ఫాలోయింగ్ (Following)మాత్రం అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ ముద్దుగుమ్మలకు విజయ్ ఫేవరేట్ హీరో (favorite hero)గా మారిపోయాడు.

అయితే ఇటీవల బెంగాలీ (bengali)నటి మాలోబికా బెనర్జీ (Malobika Banerjee)విజయ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. విజయ్‌కు హిందీ (hindi) అర్థం కాదని.. ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడేవాడు అంటూ తనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంది. ‘విజయ్ చాలా మంచి వ్యక్తి. అతను చాలా ప్రొఫెషనల్ (professional) చేసే పని పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తాడు. గతంలో ఓ ప్రైవేట్ ఆల్బమ్ (private album)కోసం అతనితో కలిసి స్క్రీన్ షేర్ (screen share)చేసుకున్నాను. అయితే ఆ సాంగ్ (song)షూట్ (shoot)సమయంలో సెట్లో ఉన్న వారందరితో నేను హిందీలో మాట్లాడేదాన్ని. అలా విజయ్ తో కూడా హిందీలోనే మాట్లాడాను. కానీ అతడు నా భాష విని ఎగతాళిగా నవ్వేవాడు. నేను మాట్లాడింది అర్థం కాలేదని.. నా భాష కొత్తగా ఉందని అవహేళన చేసేవాడు. తను మాత్రం అందరితో తెలుగులోనే (telugu)మాట్లాడేవాడు. అలాంటిది ఇప్పుడు నేరుగా హిందీలో సినిమా చేశాడు. ఇటీవల లైగర్ ట్రైలర్ (trailer)చూశాను. హిందీ భాషను వెక్కిరించి.. మళ్లీ హిందీలో సినిమా చేస్తున్నాడంటే ఆశ్చర్యపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది.

(Rowdy Hero: తప్పుల నుంచి నేర్చుకుని విజయాన్ని ఆస్వాదిస్తా…)

ఇక ప్రస్తుతం విజయ్ డైరెక్టర్ (director)శివ నిర్వాణ (shiva nirvaana)దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నారు. ఇందులో సమంత (samantha)కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పస్ట్ లుక్ పోస్టర్ (first look poster)ఆకట్టుకుంటుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ (shooting)శరవేగంగా జరుగుతుంది.  అలాగే ఇటీవల జరిగిన సైమా అవార్డ్స్ (simaa awards)2022లో యూత్ ఐకాన్ ఆఫ్ ది సౌత్ ఇండియా సినిమా (Youth Icon of the South Indian Cinema)అవార్డు సొంతం చేసుకున్నాడు విజయ్. అయితే ఈ అవార్డు తీసుకున్న తర్వాత రౌడీ ఇచ్చిన స్పీచ్‏కు (speech) సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో విజయ్ మాట్లాడుతూ.. ‘ఈ వేదికపై అవార్డులు అందుకున్న అందరికీ కృతజ్ఞతలు. గొప్ప సినిమాలు, అద్భుతమైన పెర్ఫామెన్స్‏తో మీరు ఈ సంవత్సరం సినీ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. నేను కూడా ఇండస్ట్రీకి హిట్ (industry hit)ఇద్దామనుకున్నాను. అందుకు చాలా ప్రయత్నించినప్పటికీ కుదర్లేదు.

మనందరికీ మంచి, చెడు (bad and good)రోజులు వస్తాయి. ఏ రోజుల్లోనైనా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మనం చేయాల్సిన పనులు కచ్చితంగా.. చాలా జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ వేడుకకు రాకూడదనుకున్నాను. కానీ మీ అందరికీ ఓ విషయం చెప్పాలని వచ్చాను. మీ అందరిని ఎంటర్టైన్ చేస్తానని మాటిస్తున్నాను’ అంటూ తన మనసులోని మాటను బటపెట్టాడు.  ప్రస్తుతం రౌడీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఇక విజయ్  ‘అర్జున్ రెడ్డి’ (Arjun reddy)మూవీతో ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోగా.. ఆ తర్వాత వచ్చిన ‘గీతా గోవిందం’ (Geetha govindam)సినిమాతో బ్లాక్ బస్టర్ (blackbuster)హిట్ సొంతం చేసుకున్నాడు.

(Kerala:నగ్నంగా నటించాల్సిందే.. ఫిమేల్ డైరెక్టర్ వార్నింగ్)

Exit mobile version