end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంవేల కోట్లు ఎగొట్టిన విజయ్ మాల్యాకు జైలు శిక్ష...
- Advertisment -

వేల కోట్లు ఎగొట్టిన విజయ్ మాల్యాకు జైలు శిక్ష…

- Advertisment -
- Advertisment -

విజయ్ మాల్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన గురించి అందరికీ తెలిసిందే. రూ. వేల కోట్లు ఎగొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు ఈయన. ఇప్పుడు ఈయనకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. 2017 నాటి కోర్టు ఆదేశాలను మాల్యా ధిక్కరించారు. దీంతో సుప్రీం కోర్టు ఈయనకు నాలుగు నెలలు జైలు శిక్ష వేసింది. అంతేకాకుండా రూ. 2 వేల జరిమానా కూడా విధించింది. 2017లో విజయ్‌ మాల్యా సుప్రీం కోర్ట్‌ తీర్పును ఉల్లంఘిస్తూ మాల్యా 40మిలియన్‌ డాలర్లను తన పిల్లలకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఆ సమాచారాన్ని కోర్ట్‌కు చెప్పే ప్రయత్నం చేయలేదు. పైగా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాడు. దీంతో మాల్యాపై సుప్రీం కోర్ట్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ జరిపింది. ఇది కోర్టు ధిక్కారణ కిందికి వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

బ్యాంకులకు 9,500 కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడిన విజయ్ మాల్యా. ఇప్పటికే ఆయనకు చెందిన పలు ఆస్తులను బ్యాంకులు వేలం వేశాయి. తమకు చెల్లించాల్సిన మొత్తంలో నుంచి కొంతవరకు రాబట్టుకోగలిగాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాలను పర్యవేక్షించింది. లీడ్ బ్యాంక్‌గా వ్యవహరించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గోవా వంటి పలు నగరాల్లో విజయ్ మాల్యా, ఆయనకు చెందిన సంస్థల పేర్ల మీద ఉన్న ఆస్తులను జప్తు చేశాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -