end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంమాల్యా రివ్యూ పిటిషన్‌పై ఉత్తర్వులు రిజర్వు
- Advertisment -

మాల్యా రివ్యూ పిటిషన్‌పై ఉత్తర్వులు రిజర్వు

- Advertisment -
- Advertisment -

ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు ఎగవేసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు తన పిల్లలకు 40 మిలియన్‌ డాలర్ల బదిలీ చేసి కోర్టు ధిక్కారానికి పాల్పడిన ఘటనలో 2017లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అయితే విజయ్‌ మాల్యా ఆ ఉత్తర్వులను పునః సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విచారణలో భాగంగా జస్టిస్‌ యూయూ లలిత్‌, అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మశాసనం …. మాల్య బ్యాంకు రుణ ఎగవేత, తిరిగి చెల్లింపులో విఫలం, తన ఆస్తి వివరాలు వెల్లడించడంలో విఫలమయ్యాడని విరవణ కోరింది. అదేగాకుండా దీనికి సంబంధించిన కేసు ఫైల్‌ను ఏయే అధికారులు డీల్‌ చేశారో అందరి వివరాలను కోర్టుకు సమర్పించాలని ధర్మశాసనం ఆదేశించింది.

పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ

విజయ్‌ మాల్యా బ్యాంకు రుణాలు ఎగవేసి లండన్‌లో ఉంటున్నాడని, తన పిల్లల పేరిట 40 మిలియన్‌ డాలర్లన బదలాయించాడని ఇది కచ్చితంగా కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే ని గతంలో కన్సార్షియం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో విజయ మాల్యాను దోషిగా పేర్కొంటూ జులై 14, 2017 నాడు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్ ను దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. దీనిలో భాగంగా గురువారం సుప్రీం కోర్టు పిటిషన్‌పై ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచింది.

also read…

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -