దసరా అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో జరిగే వేడుకలే. ఈ సారి పది రోజుల పాటు అతివైభవంగా ఉత్సవాలు చేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకూ దసరా మహోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో భ్రమరాంబ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది 10 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని, పది రోజుల పాటు పది వేరు వేరు అలంకారాల్లో అమ్మవారి దర్శనం కనిపిస్తుందని తెలిపారు. మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) అమ్మ వారిని దర్శించుకుంటారని చెప్పారు. దసరా మహోత్సవాలకు టెండర్లు పూర్తయ్యాయని, పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.
(పుణ్యస్నానం చేయడం వల్ల ఫలం ఏమిటి?)
రూ.80 లక్షలతో ప్రత్యేకంగా విద్యుద్ధీకరణ, ఘాట్ రోడ్లలో క్యూలైన్ల నిర్మాణం చేపట్టామన్నారు. కలెక్టర్(Collector) అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. కరోనా(Corona) తగ్గుముఖం పట్టడంతో ఈసారి ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు భావించారు. భక్తులకు అన్ని రకాల దర్శనాలు ఉంటాయని, బ్రేక్ దర్శనాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రసాదం(Sacred Food) కోసం ప్రత్యేక కౌంటర్లు(Counters) ఏర్పాటు చేశామని, తిరుమల తరహాలో నాణ్యమైన లడ్డూలు ప్రసాదంగా అందిస్తామన్నారు. ఆలయ దర్శనవేళలు, టిక్కెట్లు బుకింగ్, మార్పులు చేర్పులు కోసం దేవస్థానం వెబ్‌సైట్‌లో(Website) సందర్శించవచ్చునని తెలిపారు.
అమ్మవారి దర్శనానికి రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రోజూ 30 వేల మందికి పైగా అమ్మవారి దర్శనానికి వస్తారని, మూలా నక్షత్రం రోజు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎటువంటి ఆటంకాలు, ఏర్పాట్లు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పోలీస్, రెవెన్యూ ,మున్సిపల్, వైద్య ఆరోగ్య, ఆర్అండ్ బీ,పీడబ్ల్యూడీ, అగ్నిమాపక , ఇరిగేషన్, మత్స్య , సమాచార పౌర సంబంధాలు(Information And Public Relations ) తదితర శాఖ అధికారుల సమన్వయం చేసుకుని ఉత్సవాలను విజయవంతం జరుపుతామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.
(భగవంతునికి తలనీలాలు ఎందుకు సమర్పించాలి?)